కోర్టు గదిలో పేలిపోయిన న్యాయవాది ఫోన్.. న్యాయపోరాటానికి సిద్ధం!

కోర్టు గదిలో పేలిపోయిన న్యాయవాది ఫోన్.. న్యాయపోరాటానికి సిద్ధం!
విచారణ జరుగుతుండగా పేలిన ఫోన్
న్యాయవాదికి గాయాలు
న్యాయపోరాటం చేస్తానన్న గౌరవ్ గులాటి

కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ న్యాయవాది జేబులోని స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. దేశ రాజధానికి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటి ఇటీవల వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశారు. ఆయన కోర్టు గదిలో ఉన్న సమయంలో జేబులో ఉన్న ఫోన్ నుంచి తొలుత మంట వచ్చింది. ఆ తర్వాత క్షణాల్లోనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనపై గులాటి మాట్లాడుతూ.. ఫోన్ పేలిన విషయమై వన్‌ప్లస్ సంస్థను తాను సంప్రదించబోనని పేర్కొన్నారు. కానీ, ఆ సంస్థపై నేరుగా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై వన్‌ప్లస్ సంస్థ స్పందించింది. ఫోన్‌ను పరీక్షించకుండా పరిహారం చెల్లించలేమని పేర్కొంది. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గౌరవ్‌ను సంప్రదిస్తే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది.

Leave a Reply

%d bloggers like this: