జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయడంతో రాజుకు బీపీ …జగన్ కు ఊరట!

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయడంతో రాజుకు బీపీ …జగన్ కు ఊరట!
-జగన్ బెయిల్ రద్దు విషయంలో ఉత్కంఠతకు తెర ..
-జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టేసిన సిబిఐ కోర్టు
-హైకోర్టు కు వెళతానన్న రఘరామ
-బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన రఘురామ
-ఈరోజు తీర్పును వెలువరించిన సీబీఐ కోర్టు
-కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన పిటిషన్లు
-తీర్పు సాక్షిపేపర్ లో వచ్చిన విధంగానే ఉందన్న రఘురామ
-హైకోర్టులో కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తా

గత కొన్ని రోజులుగా ఇత్కంఠతను రేకెత్తించిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఎట్టకేలకు సుదీర్ఘంగా విచారించిన సిబిఐ ప్రత్యేకకోర్టు నేడు కొట్టివేసింది. పిటిషనర్ రఘరామ కృషంరాజు జగన్ తో పాటు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ సిబిఐ కోర్ట్ లో పిటిషన్ లు వేశారు. సిబిఐ కోర్ట్ విచారణకు స్వీకరించి విచారించింది. చివరకు రఘరామ వాదనల్లో పసలేదని తేల్చి పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో రఘురామ రాజుకు బీపీ పెరిగి జగన్ కు ఊరట లభించింది . జగన్ శిభిరంలో ఆనందం వ్యక్తం అవుతుండగా రఘురామ అండ్ కో కు మింగుడు పడని అంశంగా మారింది. కోర్ట్ తీర్పు పై తాను హైకోర్టు కు అక్కడ కాకపోతే సుప్రీం కోర్ట్ కు వెళతానని రఘురామ ప్రకటించడం గమనార్హం . సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్ ను కొట్టి వేస్తారని ముందుగానే తెలుసునని రఘురామ పేర్కొన్నారు .

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి ఇద్దరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్లు వేశారు.

ఈ పిటిషన్లపై జులై ఆఖరులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు… ఈరోజు తీర్పును వెలువరించింది. రఘురాజు పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో, గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశానికి ముగింపు కార్డు పడింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైసీపీ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది.

సీబీఐ కోర్టు తన పిటిషన్ ను కొట్టివేయడంపై రఘురామకృష్ణరాజు స్పందన

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వీరిద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో రఘురాజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళతానని ఆయన అన్నారు. వచ్చే వారంలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు.

సీబీఐ కోర్టు తీర్పు ఇలాగే వస్తుందని తాను ముందే ఊహించానని రఘురామకృష్ణరాజు అన్నారు. గత విచారణ సందర్భంగా జడ్జి తన అభిప్రాయాన్ని వెల్లడించకముందే… జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసిందంటూ సాక్షిలో బ్రేకింగ్ వచ్చిందని… ఆ రోజు సాక్షి ప్రకటించిన విధంగానే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు.

తాను నెగ్గననే విషయం గత నెల 25వ తేదీనే తనకు అర్థమయిందని చెప్పారు. ఒకవేళ కోర్టులో తాను నెగ్గి ఉంటే… జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టుకు వెళ్లేవారని… ఇప్పుడు తాను హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. హైకోర్టులో కూడా వారికి అనుకూలంగానే తీర్పు వస్తే… తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: