ఉత్తర‌ప్ర‌దేశ్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ?..

ఉత్తర‌ప్ర‌దేశ్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ?..
-స్పందించిన కేంద్ర మాజీ మంత్రి స‌ల్మాన్ ఖుర్షీద్
-ఈ విష‌యంపై ప్రియాంక‌ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది
-కాంగ్రెస్ అధ్య‌క్షురాలి ప‌ట్ల మేము సంతృప్తిగానే ఉన్నాము
-ఇత‌ర పార్టీల నేత‌లే దీనిపై సంతృప్తిగా లేరు

ఉత్తరప్రదేశ్ కు మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికారంలో ఉన్న బీజేపీ గట్టిపట్టుదలతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం కలిసొచ్చా అంశంగా ఉంది. బీజేపీ కి ఎస్పీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి . అయినప్పటికీ బీఎస్పీ నాయకురాలు మాయావతి కూడా బలంగానే ఉంది. ఈ మూడు పార్టీలను కాదని యూపీ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమైయ్యే పని కాదు . కానీ కాంగ్రస్ కు కూడా ఎక్కడో ఆశ ఉంది. అందువల్ల గాంధీ ఫ్యామిలీ కి చెందిన ఆడపడుచు ప్రియాంకను కాంగ్రెస్ సీఎం అభ్యర్తగా పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది . అయితే దీనికి ఆమె అంగీకరిస్తారా ? లేదా అనేది సందేహంగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్ ఇదే విషయాన్నీ చెప్పారు

ఉత్తర‌ప్ర‌దేశ్ సీఎం అభ్య‌ర్థిగా కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ పేరును ప్ర‌క‌టిస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత‌ స‌ల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రియాంకా గాంధీ నేతృత్వంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయ‌నుంది. యూపీలో మా పార్టీ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ నిలుస్తారా? లేదా? అన్న విష‌యంపై ఆమే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది’ అని ఆయ‌న అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్య‌క్షుడి అంశంపై స‌ల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ… ‘ఇప్ప‌టికే మా పార్టీకి అధ్య‌క్షురాలు ఉన్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలి ప‌ట్ల మేము సంతృప్తిగానే ఉన్నాము. ఇత‌ర పార్టీల నేత‌లే దీనిపై సంతృప్తిగా లేరు. కాబ‌ట్టి ఇప్పుడు మా పార్టీకి మ‌రో అధ్య‌క్షుడు అవ‌స‌రం లేదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, రాహుల్ గాంధీని త‌దుప‌రి కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా నియ‌మించాలంటూ ఇటీవ‌లే ఆ పార్టీ సోష‌ల్ మీడియా శాఖ ఓ తీర్మానం చేసింది. ఇంత‌కు ముందు ఢిల్లీ ప్ర‌దేశ్ మ‌హిళా కాంగ్రెస్ కూడా ఇటువంటి తీర్మానాన్నే చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్నాయి.

Leave a Reply

%d bloggers like this: