కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !
-మోదీ, కేసీఆర్ వల్ల దేశం, రాష్ట్రం ప్రమాదంలో పడ్డాయి: రేవంత్
-వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధం …తమ్మినేని
-కబర్దార్ నరేందర్ మోడీ …నీ ఆటలు సాగనివ్వం …చాడ వెంకట రెడ్డి
-ఇద్దరూ తోడు దొంగలంటూ ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్
-అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాట్లాడిన రేవంత్
-దేశం ఆస్తులు అమ్మేస్తున్నారని మోదీపై ఫైర్
-రాష్ట్రంలోని భూములను బంధువులకు కట్టబెడుతున్నారని కేసీఆర్‌పై విమర్శ
-30 న కలెక్టర్లకు భూ సమస్యపై అఖిలపక్షం వినతి పత్రం
-అక్టోబర్ 5 న 400 కీ మీ రహదార్ల దిగ్బంధనం

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఇక ప్రజాయుద్ధం కోసం అఖిలపక్షం నేతలు సమరశంఖం పూరించారు.బుధవారం ఇందిరా పార్క్ లో జరిగిన ధర్నా లో వివిధ పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందరభంగా మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ ఢిల్లీలో కిసాన్ మోర్చా ఆధ్వరంలో జరుగుతున్నా ఆందోనళకు మద్దతుగా ఈ నెల 27 న తేదీన జరిగే బందు ను జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు.

ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వీరి హయాంలో పెట్రోలు, డీజిలు ధరలు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు.

మోదీ గొప్పగా చెప్పుకునే నోట్ల రద్దు పేదల పాలిట విషప్రయోగమని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ అమ్ముకుంటున్నారని విమర్శించారు. మోదీ హయాంలో దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అంబానీ, అదానీ రెడీగా ఉన్నారన్నారు.

అదే విధంగా కేసీఆర్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను తన బంధువులకు కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. వీరి వల్ల దేశం, రాష్ట్రం పెను ప్రమాదంలో పడ్డాయని, వీటిని రక్షించుకోవాలని చెప్పారు. మోదీ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని, భారత్ బంద్‌లో తెలంగాణ ముందుండాలని రేవంత్ పిలుపిచ్చారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే బందును జయప్రదానికి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రచారాన్ని తీసుకెళ్లాలని ,అందుకు అన్ని పార్టీల కార్యకర్తలు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు. 30 న కలక్టర్ల కు వినతి ప్రాంతం ఇవ్వాలని అన్నారు అదే విధంగా అక్టోబర్ 5 పోదు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో రహదార్ల దిగ్బంధాన్ని జయప్రదం చేయాలనీ కోరారు.

వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు నీ ఆటలు సాగనివ్వం ఖబర్దార్ మోడీ అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ , కాంగ్రెస్ నాయకులూ నాగం జనార్దన్ రెడ్డి , షబ్బీర్ అలీ , టి జె ఎస్ నాయకులూ ప్రొఫెసర్ కోదండ రామ్ , ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు , తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ , తదితరులు ప్రసంగించారు.

Leave a Reply

%d bloggers like this: