Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

అమెరికాలో గన్ కల్చర్ …పాఠశాలలో విద్యార్థులు మధ్య ఘర్షణ కాల్పులు…

అమెరికాలో మళ్లీ కాల్పులు.. తోటి విద్యార్థులపై తుపాకి ఎక్కుపెట్టిన విద్యార్థి
-టెక్సాస్ అర్లింగ్టన్‌లోని టింబర్ వ్యూ పాఠశాలలో ఘటన
-కాల్పులు జరిపిన 18 ఏళ్ల తిమోతీ
-ఒకరి పరిస్థితి విషమం
-నిందితుడిపై మూడు అభియోగాలు మోపిన పోలీసులు

అమెరికాలో గన్ కల్చర్ తో పాఠశాలలు ఫైరింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రపంచంలొనె అభిరుద్ది చెంది అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో ఎలాంటి ఘటనలకు కొదవలేదు …రోజు ఎదో ఒక రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాను పాలిస్తున్న పాలకులు ప్రపంచంలో స్థాపనకు తమసైన్యాలను పంపిస్తున్నారుగాని తమ దేశంలోని పాఠశాలల్లో జరిగే అకృత్యాలను అరికట్టడంలో వైఫల్యం చెందుతున్నారని విమర్శలు ఉన్నాయి. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అర్లింగ్టన్ లోని ఒకపాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన చిన్న తగాదా కాల్పులకు దారితీసింది.

అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులకు కారణమైంది. టెక్సాస్‌లోని అర్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి టింబర్ వ్యూ పాఠశాలలో విద్యార్థుల మధ్య ప్రారంభమైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 18 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించగా భయంతో అందరూ పరుగందుకున్నారు. ఈ క్రమంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారమందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని తిమోతీ జార్జ్ సింప్‌కిన్స్‌గా గుర్తించారు. అతడిపై మూడు అభియోగాలు నమోదు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

Ram Narayana

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…

Drukpadam

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను పవన్ కళ్యాణ్ మిస్ లీడ్ చేశాడా ?

Drukpadam

Leave a Comment