ప్రేమించడం లేదని బాలికను నడిరోడ్డు పై కిరాతకంగా చంపిన దుర్మార్గుడు …

ప్రేమించలేదని యువకుడి కిరాతకం.. నడిరోడ్డుపై బాలిక దారుణ హత్య

  • బాలిక కబడ్డీ ప్రాక్టీసుకు వెళుతుండగా ఘటన
  • స్నేహితులతో బైక్‌పై వచ్చి అడ్డగింత
  • వెంటపడుతున్నా ప్రేమించడం లేదని కిరాతకం
  • విచక్షణ రహితంగా పొడిచి పరారీ

ప్రేమించడం లేదంటూ తన దగ్గర బంధువైన 14 సంవత్సరాల బాలికను తన స్నేహితులతో కలసి వెంబడించి కత్తులతో పొడిచిన ఘటన మహారాష్ట్రలోని పూణే లో జరిగింది. ఆ బాలిక కబడ్డీ శిక్షణ కోసం వెళుతున్న దారిలో తన స్నేహితులతో కలిసి వచ్చిన దుర్మార్గుడు ,ఆమెను అడ్డగించి నోటికి ఉచ్చరించారని భూతులు తిట్టి ,తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచి చంపడం కలకలం రేపింది. ముక్కు పచ్చలారని ఆ బాలికను చంపిన దుండగులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు వెతుకుతున్నారు.

మహారాష్ట్రలోని పూణెలో నిన్న నడిరోడ్డుపై జరిగిన బాలిక హత్యోదంతం కలకలం రేపింది. ప్రేమించాలని వెంటపడుతున్నా తిరస్కరిస్తోందన్న కారణంతో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను దూరపు బంధువైన యువకుడు స్నేహితులతో కలిసి అతి దారుణంగా హతమార్చాడు.

నిన్న సాయంత్రం బాలిక పూణెలోని బిబేవాడీ ప్రాంతంలో కబడ్డీ శిక్షణకు వెళుతున్న సమయంలో ముగ్గురు యువకులు బైక్‌పై వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం ముగ్గురూ కలిసి బాలికపై కత్తులతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది.

నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రేమించాలని వెంటపడుతున్నా బాలిక నిరాకరిస్తుండడంతో ఆమె దూరపు బంధువైన 22 ఏళ్ల యువకుడే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: