Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భూముల పరిహారం పెంచాలంటే రైతులపై కేసులు …యూ పీ ప్రభుత్వ నిర్వాకం…

భూముల పరిహారం పెంచాలంటే రైతులపై కేసులు …యూ పీ ప్రభుత్వ నిర్వాకం…
-ఆందోళన చేస్తున్న 1500 మంది రైతులపై హత్యాయత్నం కేసులు!
-ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోవట్లేదని ఆందోళన
-పరిహారం పెంచి ఇవ్వాలని 40 రోజులుగా డిమాండ్
-హత్యాయత్నం సహా పలు అభియోగాల కింద కేసుల నమోదు
-ఇటీవలనే రైతులపై తన కాన్వాయ్ తో తొక్కించిన కేంద్రమంత్రి
-యోగి సర్కారులో రైతులకు రక్షణ లేదనే ఆందోళన

యూ పీ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా ? లేక జంగల్ రాజ్ నడుస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి తన కాన్వాయ్ తో రైతులను తొక్కించి 9 మంది మరణానానికి కారణమైన సంఘటన మరవకముందే తమ భూములకు పరిహారం సరిపోదు పెంచడన్న పాపానికి 1500 రైతులపైనా హత్యాయత్నం కేసులు బనాయించడంపై రైతులు భగ్గుభగ్గుమంటున్నారు . రైతులు తాము ప్రభుత్వ అవసరాలకు భూములు ఇస్తున్నాం అయితే మాకిచ్చే పరిహారం సరిపోదు పెంచాలని కోరుతున్నాం . మామోర ఆలకించాలని కోరుతున్నాం గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్న పట్టించుకోలేదు వివిధ మార్గాలలో తమ నిరసన తెలిపాము . అయినా పట్టించుకోకుండా తమపైనే ఉల్టా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసులు ఒక్క మోగా రైతులపైనే కాదు ఆడవారి పైన కూడా హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గం అంటున్నారు రైతులు .యోగి సర్కార్ ఇప్పటికైనా తమపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసహంరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తమ నుంచి సేకరిస్తున్న భూములకు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలంటూ నోయిడాలో ఆందోళన చేస్తున్న రైతులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్యాయత్నం కేసులు నమోదు చేసింది. తమ నుంచి సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, మరికొంత పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 40 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న దాదాపు 1500 మంది రైతులపై పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. రైతులపై నమోదైన అభియోగాల్లో హత్యాయత్నం, అల్లర్లు రేపడం, అక్రమ నిర్బంధం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి ఉన్నాయి.

ఈ కేసులపై అధికారులు మాట్లాడుతూ.. నోయిడా అథారిటీ కార్యాలయం ప్రధాన ద్వారానికి భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్‌వీర్ ఖలీఫా, మరికొందరు నేతలు తాళం వేశారని, ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. సుఖ్‌బీర్ సహా మొత్తం 31 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసినట్టు తెలిపారు.

Related posts

ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం నేత పోతినేని

Drukpadam

చంద్రబాబుకు భారీ ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

పిస్టల్ తీసిన టీఆర్ యస్ నేత వారించిన సహచరులు

Drukpadam

Leave a Comment