బీజేపీ అడ్డుకట్ట వేయాల్సిందే …అందుకు ప్రతిపక్షాల ఐక్యత అవసరం: శరద్ పవార్…

బీజేపీ అడ్డుకట్ట వేయాల్సిందే …అందుకు ప్రతిపక్షాల ఐక్యత అవసరం: శరద్ పవార్…
-యూపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఐక్యం కావాలి :
-బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం వచ్చింది.
-ఓట్లు చీలకుండా ఉండటం చాలా కీలకం
-విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభం

వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 2024 లో జరిగే లోకసభ ఎన్నికల దిశను యూ పీ ఎన్నికలు సూచించనున్నాయి .దేశంలో 6 వవంతుకు పైగా లోకసభ సభ్యులు ఉన్న యూ పీ చాలాకీలకమైన రాష్ట్రం . అందువల్ల ఇక్కడ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయి. ప్రతిపక్షాల మధ్య ఐక్యత అవసరం అని ఎన్సీపీ అధ్యక్షుడు రాజకీయ కురువృద్ధుడుగా ఉన్న శరద్ పవర్ అంటున్నారు. ఐక్యత అవసరం అని అన్ని పార్టీలలో ఉన్నప్పటికీ ఎవరికీ వారు విడివిడిగా పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఇది కచ్చితంగా బీజేపీకి లభించే అంశమే . ఇక్కడ బలమైన రాజకీయ కులపునాదులు కలిగిన ఎస్పీ , బీఎస్పీ లు వేరు వేరు గానే పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుకు ఎస్పీ సిద్దపడటంలేదు . బీఎస్పీ ఎస్పీ తో కలిసేందుకు రెడీ గా లేదు . శరద్ పవర్ ఐక్యత అవసరం అని అంటున్నారు. ఇది సాధ్యమేనా ?అని రాజకీయపండితుల భావన …

ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం పై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. . ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన సూచించారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని చెప్పారు.

ఎన్నికల్లో ఓట్లు సాధ్యమైనంతగా చీలకుండా చూడటం చాలా కీలకమని శరద్ పవార్ అన్నారు. బీజేపీయేతర పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఆయన స్పందిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు. సీబీఐ, ఎన్సీబీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు.

Leave a Reply

%d bloggers like this: