పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ..పాల్గొన్న సిపి విష్ణు వారియర్!

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ..పాల్గొన్న సిపి విష్ణు వారియర్!
-గౌరమ్మకు పూజ చేసి వేడుకలు ప్రారంభించిన సీపీ సతీమణి హృదయ మేనన్
-కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న అధికారులు
-ఇతర సిబ్బంది .బతుకమ్మలని పేర్చి ఆడిన సిపి
-కోలాటంతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కోలాహలం

 

బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకల సందర్భంగా
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, పోలీస్ అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సతీమణి హృదయ మేనన్ గౌరమ్మకు పూజ చేసి వేడుకలు ప్రారంభించారు.

పోలీస్ కుటుంబాలు బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి రంగు రంగుల బతుకమ్మలుగా సుందరంగా పేర్చారు. పెద్ద ఎత్తున బతుకమ్మలను మహిళలు తీసుకొచ్చి ఒకే చోట ఉంచి పాటలు పాడుతూ చప్పట్లను వేస్తూ, కోలాటాలు ఆడి ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పరేడ్ గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.

 

కార్యక్రమంలో
అడిషనల్ డిసిపి లా& ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఎఆర్ అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఎసిపి స్నేహ మెహ్రా , టౌన్ ఏసీపీ అంజనేయులు, రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం, సీసీఎస్ ఎసిపి జహాంగీర్ , ఎఆర్ ఏసీపీ విజయబాబు, సిఐ లు చిట్టిబాబు, అంజలి, సర్వయ్య, ఏవో అక్తరూనీసాబేగం, ఆర్ ఐ రవి, శ్రీనివాస్ రావు సాంబశివరావు , తిరుపతి ,శ్రీశైలం పాల్గొన్నారు.

 

Leave a Reply

%d bloggers like this: