మంత్రి కే. తారకరామారావుకి ఫ్రెంచ్ ప్రభుత్వ ఆహ్వానం.!

మంత్రి కే. తారకరామారావుకి ఫ్రెంచ్ ప్రభుత్వ ఆహ్వానం.!

ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే అంభిషన్ ఇండియా – 2021 సదస్సులో (ambition India – 2021) ప్రసంగించాల్సిసిందిగా విజ్ఞప్తి

గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో- ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశం పై తన అభిప్రాయాలను పంచుకొనున్న మంత్రి కేటీఆర్

ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కే తారక రామారావు కి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కే. తారకరామారావు ని తమ సెనెట్లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పంపింది. ఈ నెల 29 న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది. ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్- ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార , వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో పేర్కొంది. అంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్ గా గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.

Leave a Reply

%d bloggers like this: