Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

‘మా’ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మంచు విష్ణు..

‘మా’ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మంచు విష్ణు..
పెన్షన్ల ఫైల్ పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు
అందరి మద్దతు తనకు కావాలని కోరిన విష్ణు
రాజీనామాలపై విష్ణు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారిన వైనం

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు నేడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మిగతా పదవులకు ఎన్నికైన వారు భాద్యతలు ఎప్పడు స్వీకరిస్తారనేది తెలియలేదు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన ఆఫీస్ బేరర్స్ ఇతర కార్యవర్గ సభ్యులు మూకుమ్ముడిగా రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఉపసంహరింప చేసేందుకు విష్ణు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు అందుకు అంగీకరిస్తారా ? లేదా అనేది చూడాల్సి ఉంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్ష హోదాలో ఆయన తొలి సంతకాన్ని పెన్షన్ల ఫైల్ పై చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు అందరి మద్దతు తనకు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల అంశంపై ప్రెసిడెంట్ హోదాలో మంచు విష్ణు ఎలా వ్యవహరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులను కలుపుకుని పోతారా? లేకపోతే బైలాస్ ప్రకారం కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి. మరోవైపు ఇతర పదవులకు ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related posts

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్….

Drukpadam

పవన్ కల్యాణ్… నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు!

Drukpadam

చిరంజీవి చేతికి చికిత్స …మణికట్టుకు బ్యాండేజ్ !

Drukpadam

Leave a Comment