మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత… ఎయిమ్స్ కు తరలింపు !

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత… ఎయిమ్స్ కు తరలింపు !
-నిన్నటి నుంచి మన్మోహన్ కు జ్వరం
-ఇవాళ బాగా నీరసించిన మాజీ ప్రధాని
-ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎయిమ్స్ వర్గాలు
-ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారినపడ్డ మన్మోహన్

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ ను ఈ సాయంత్రం ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. మన్మోహన్ కు నిన్న జ్వరంకాగా, ఇవాళ బాగా నీరసించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారినపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా పాజిటివ్ రావడంతో ఆయనకు ఎయిమ్స్ లోనే చికిత్స అందించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆరాతీశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ , సీనియర్ నేత రాహుల్ గాంధీ , తదితరులు ఆస్పత్రి వర్గాలను ఆరాతీశాయి. ప్రధాని మోడీ , ఇతర నేతలు కూడా మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

%d bloggers like this: