Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ , నిప్పులు చెరిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి…

టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ , నిప్పులు చెరిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి…
-తెలంగాణ ద్రోహులందరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారని ధ్వజం
-ఓడిపోయే యుద్ధం కాబట్టే యువరాజు హుజురాబాద్ రావడం లేదు
-కాళేశ్వరం ఓ కమీషన్ ప్రాజెక్టు
-తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళను టీఆర్ యస్ నుంచి తరిమేస్తున్నారు
-ఈటలను గెలిపించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి
-నియంత పాలన అంతమైతేనే రాష్ట్రం బాగు

టీఆర్ఎస్‌పై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం పర్యటన చేసిన అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఘాటైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ అని అందులో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. అందరు డూడూ బసవన్నలేనని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహులందరూ మూకుమ్మడిగా అందులోనే ఉన్నారని ఉద్యమకారులను కేసీఆర్ ,కేటీఆర్ సహించరాని వారిని బయటకు పంపించడమే వారి లక్ష్యం అని అన్నారు. ఉద్యమం తో ఏమాత్రం సంబంధం లేని అనేక మంత్రులుగా కొనసాగటం మన దౌర్బాగ్యం అన్నారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. అందువల్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలవాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలను పార్టీ నుంచి బయటకు తరమేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. టీఆర్ యస్ పార్టీ తండ్రి కొడుకుల ప్రవేట్ ప్రాపర్టీ లాగా అయిందని విచారం వ్యక్తం చేశారు.

ఆ పార్టీలో తండ్రీ కొడుకులకు తప్ప మరెవరికీ మాట్లాడే అధికారం లేదనీ, వారి కనుసైగలలోనే రాష్ట్రం ఉందని అన్నారు. ఈ నియంతల పాలన అంతమైతే తప్ప రాష్ట్రం బాగుపడదని పేర్కొన్నారు. హుజురాబాద్ లో తాము ఎలాగూ గెలవలేమని భావించిన యువరాజు ఓడిపోయే యుద్ధం కాబట్టే ఇక్కడికి రావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఈటల వల్లే దళితబంధు పథకం తెచ్చారన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు . ఏంటో ఆర్బాటంగా నిర్మించిన కాళేశ్వరం ఓ కమీషన్ ప్రాజెక్టు అని విమర్శించారు.

Related posts

ఆగని పొంగులేటి దూకుడు …వైరాలో ఆత్మీయ సమ్మేళనం

Drukpadam

దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన శాలపల్లిలో కూడా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ!

Drukpadam

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్‌ చన్నీ ఎంపిక…

Drukpadam

Leave a Comment