హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం..

హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం.. కారులో వెళుతున్న వ్యక్తిని బయటకు లాగి నరికి చంపిన దుండగులు
చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు వెళుతుండగా ఘటన
కారును అడ్డగించి బయటకు లాగి దాడి
అందరూ చూస్తుండగానే ఘటన

రాష్ట్రా రాజధాని హైద్రాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నప్పటికీ రోజుకు ఎదో ఒకచోట నేరాలు ,ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కిడ్నాపులు ,అత్యాచారాలు , హత్యలు , దోపిడీలు , దొంగతనాలు నిత్యకృత్యమైపోయాయి. ఇటీవలనే ఒక బాలిక పై యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే . అంతకు ముందు అనేక సంఘటనలు , తాజాగా ఒక వ్యక్తి కారులో వెళుతుండగా అడ్డగించి ఆయన్ను కార్ లోనుంచి దించి దారుణంగా నరికి చంపిన ఘటన ఆందోళనకు గురిచేస్తుంది. విశ్వ నగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ లో జరుగుతున్నా సంఘటనలు మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి .

హైదరాబాద్ పాతబస్తీలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళుతున్న వ్యక్తిని అడ్డగించిన వ్యక్తులు ఆపై అందులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి నడిరోడ్డుపైనే కత్తులతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడించి చంపారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపైనే ఈ ఘటన జరిగింది.

హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: