Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మా ఎన్నికలు ముగిసినా తగ్గని రాద్ధాంతం …

మా ఎన్నికలు ముగిసినా తగ్గని రాద్ధాంతం …
-ప్రకాష్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడా ?
-మోహన్ బాబు, నరేశ్ లపై ఆరోపణలు
-‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఘాటు లేఖ
-ఎన్నికల సందర్భంగా దురదృష్టకర ఘటనలు చూశాం
-కొందరిపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు
-సీసీ కెమెరాల ఫుటేజీ మాకు ఇవ్వండి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిలకలు ముగిశాయి. మంచు విష్ణు గెలుపొందారు ….ప్రకాష్ రాజ్ ఓడిపోయారు….మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి భాద్యతలు కూడా స్వీకరించారు…. అయినప్పటికీ ఎన్నికల రాద్ధాంతం ఇంకా తగ్గలేదు. ప్రకాష్ రాజ్ అండ్ కో తమ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలవాల్సిన తాము ఓడిపోయామని భాదపడుతున్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని , పోలింగు బూత్ వద్ద మోహన్ బాబు, నరేష్ లు తిట్టారని ఇప్పుడు ఆరోపణలు గుప్పించి ప్రయోజనం ఏమిటో ప్రకాష్ రాజ్ అండ్ కో తెలుసుకోవాలి …మొదటి రోజు వారు ప్రెస్ పెట్టారు. తమ ఆవేదన వెలిబుచ్చారు. మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కొత్తగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి చట్టబద్ధంగా లేఖ రాయడంలో తప్పులేదు కానీ అది తాను గెలవలేదనే కక్ష సాధింపులా ఉండకూడదు … ఇప్పటికే ప్రకాష్ రాజ్ వచ్చి మా లో చిచ్చు పెట్టాడనే అపవాదు ఉంది. కొంత కాలం సైలంట్ గా ఉండండి . వారు ఏమి చేస్తారో చూడండి…చేయకపోతే మీరు చెప్పినట్లు గానే ప్రశ్నించండి . అంతే కానీ తాము గెలవలేదని ఆరోపణలు చేస్తే ఎవరు పట్టించుకోరని గుర్తుంచు కొండి …..

ఎన్నికల్లో గెలుపోటములు సహజం … ఎన్నికలు పోటీ అంటేనే అదే కదా ? ప్రకాష్ రాజ్ లాంటి జాతీయస్థాయి నటుడికి బాగా తెలుసు .ఎన్నికల్లో రెండు వైపులా అద్దులు దాటి మాట్లాడు కున్నారు .వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎవరికీ వారు గెలిచేందుకు నానా పాట్లు పడ్డారు .అందులో కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఫలితాలు ఎన్నికల అధికారి స్వయంగా ప్రకటించారు. అందరు దీన్ని అంగీకరించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారంతా మూకుమ్మడిగా ఎన్నికైన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవి ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం ….

‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఘాటు లేఖ

ఎన్నికల సమయంలో అనేక అరాచకాలు జరగాయంటూ ప్రకాజ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. మరోవైపు, ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఘాటు లేఖ రాశారు. ఎన్నికల పూర్తి సారంశం ఇదే…

‘ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గారికి… ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల సందర్భంగా ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడం మీరు గమనించారు. మోహన్ బాబు, నరేశ్ వికృత, సామాజిక వ్యతిరేక ప్రవర్తనను మనందరం చూశాం. ‘మా’ సభ్యులను వారు దూషించడం, బెదిరించడం చేశారు. భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో వారు వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని నేను అనుకుంటున్నా. కొన్ని విజువల్స్ మీడియాకు లీక్ అయ్యాయి. ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన సంఘటనలు జనాలు నవ్వుకునేలా చేస్తున్నాయి. కొందరి తీరు అసహ్యాన్ని కలిగించేలా ఉంది.

పోలింగ్ సమయంలో సీసీ కెమెరాల వినియోగం గురించి మీరు మాట్లాడారు. ఆ కెమెరాలు ప్రతి ఒక్క ఘటనను రికార్డ్ చేశాయని నేను నమ్ముతున్నాను. సీసీ కెమెరాల ఫుటేజీని మాకు ఇవ్వాలని కోరుతున్నా. ఎన్నికలకు సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు మాకు ఉంది. పోలింగ్ అధికారిగా అన్ని రికార్డులను కనీసం మూడు నెలల పాటు భద్రపరచాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని లేఖలో ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు.

Related posts

తిరుపతిలో విలేకరుల సమావేశంలో గొడవపై దర్శకురాలు నందినిరెడ్డి క్లారిటీ!

Drukpadam

విష్ణు నో అని ఉంటే నేనూ నో చెప్పేవాడిని: మోహన్ బాబు

Drukpadam

బుర్రిపాలెం బుల్లోడు ఇక లేరు …

Drukpadam

Leave a Comment