సీఎం జగన్ సతీమణి భారతిపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, విద్యుత్ సంక్షోభం, డ్రగ్స్ మాఫియాపై మాట్లాడారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని.., ఆయన రాష్ట్రాన్నే కాదు భార్యను కూడా జగన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడేమో అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. సీఎం సహకారంతోనే ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతోందని నారాయణ ఆరోపచారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీలో వైసీపీ నేతల భూకబ్జాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భూకబ్జాకు పాల్పడే అధికార పార్టీ నేతలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. వైసీపీ నేతలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్ళే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

మోడీ చేతకాని పాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని, కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారని.., సిసి కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు. జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా జరుగుతున్నాయని ఆరోపించారు. నరేంద్రమోడీ పంచభూతాలను అమ్మేస్తున్నారని.., సంపద మొత్తాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ఏపీ సీఎం జగన్ కేంద్రం కన్ను సన్నల్లో పని చేస్తూ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తున్నారని నారాయణ ఆరోపించారు. మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని, నిర్లక్ష్యం, స్వార్థం వల్ల విద్యుత్ సంక్షోభం వచ్చిందని ఆయన వివరించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.

ఇక రాష్ట్రంలో జగనన్న చీకటి పథకానికి శ్రీకారం చుట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు, డిస్కంల ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కరెంట్ బిల్ తగ్గాలంటే లైట్లు, ఏసీలు ఆపమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గెలుపును ఆపేయడం ఖాయమన్నారు.

Leave a Reply

%d bloggers like this: