ఈ నెల 18న గులాబీ గూటికి మోత్కుపల్లి!

ఈ నెల 18న గులాబీ గూటికి మోత్కుపల్లి!
-కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి…
-చాలా కాలం పాటు టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి
-గత ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పిన వైనం

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజకీయనేతల్లో మోత్కుపల్లి నరసింహులు ఒకరు . తెలుగుదేశం , కాంగ్రెస్ ,బీజేపీ , ఇప్పుడు టీఆర్ యస్ ….మంచి మాటకారి ….తన వాదన పటిమతో ఎదుటివారిని కట్టి పడేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. మిగతా పార్టీలలో ఉన్నపుడు ప్రత్యర్థులపై పదునైన మాటలతో దాడి చేసేవారు . గత ఎన్నికలకు ముందు టీడీపీ కి గుడ్ బై చెప్పారు. కానీ టీఆర్ యస్ పైన ప్రత్యేకించి కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను తిట్టిన నోటితోనే నేడు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యేకించి దళిత బందు పై కేసీఆర్ అంతటి ముఖ్యమంత్రి లేడని కితాబునిచ్చారు. ఇప్పుడు దళిత బందు అమలు కమిటీ చైర్మన్ గా ఆయన్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననే దానికి బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ గా మోత్కుపల్లి ఉదాహరణగా నిలుస్తారు ….

సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన కారెక్కడానికి ముహూర్తం ఖరారయింది. ఎల్లుండి (18వ తేదీ) ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు టైమ్ ఫిక్సయింది. మోత్కుపల్లి సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు రావడమే కాకుండా, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేశారు. తాజాగా టీఆర్ఎస్ గూటికి ఆయన చేరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమ నిర్వహణను ఆయనకు కేసీఆర్ అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

%d bloggers like this: