హుజురాబాద్ ఎన్నికలకు సిపిఐ దూరం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి!

హుజురాబాద్ ఎన్నికలకు సిపిఐ దూరం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి!
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికలు
డబ్బు ,మద్యం , గంజాయి ఎదేచ్చగా ప్రవహిస్తుంది.
ప్రజాసమస్యలను గాలికి వదిలి …వ్యక్తిగత దూషణలు తెరపైకి వచ్చాయి
అధికారంలో ఉన్న రెండు పార్టీలు ప్రజాస్వామ్య విలువను కాలరాస్తున్నాయి.

హుజురాబాద్ లో జరుగుతున్న ఉపఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశాయని , డబ్బు ,మద్యం , చివరకు గంజాయి కూడా పట్టు బడటం ఆందోనళ కలిగించే అంశమని అందువల్ల ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని సిపిఐ నిర్ణయించిందని ఆపార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియా కు ప్రకటన విడుదల చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల మనోభిష్టాలను ప్రతిబింబించాలి. కాని అవి రోజు రోజుకు అధికారం, డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనవుతున్నాయి. తాజాగా మన రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక వీటన్నింటినీ తలదన్నే రీతిలో ఎన్నికల తీరునే అపహాస్యం చేస్తున్నది చాడ మండి పడ్డారు. ఇప్పటికే కోట్లాది నగదు, లక్షలాది రూపాయల విలువచేసే మద్యం, బంగారం, వెండి వస్తువులు, చీరెలు, దుస్తులు నిఘా బృందాలకు పట్టుబడినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో గంజాయి కూడ ఉండడం అందరినీ విస్తుగొల్పుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఉపఎన్నికలలో రాజకీయాలు, విధానాలకన్నా వ్యక్తిగత దూషణ-బూషణలు, ద్వేషం, కక్ష-కార్పణ్యాలు ప్రధానమైన తీరు ఏవగింపు కల్గిస్తుందన్నారు రెండు అధికార పార్టీల మధ్య కేంద్రీకృతమైన ఈ ఉపఎన్నిక సామాన్యుల పై మోపుతున్న ధరల పెనుభారాన్ని, ఆయిల్ ధరల పెంపును, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతున్న తీరు, అవినీతి బాగోతాలలో ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు వివరించడంలేదని విమర్శించారు.  ‘నువ్వు దొంగ-నువ్వు దొంగ’ అన్న చందంగా ఎన్నికల ప్రచారం సాగుతుండటంపై అసహనం ప్రకటించారు. మదపుటేనుగులు పచ్చటి అడవిని అంతం చేసినట్లు ప్రజాస్వామ్య లో  ఎన్నికల స్ఫూర్తిని బీజేపీ ,టీఆర్ యస్ లు గొంతు నులుమేలా పోరు సాగిస్తున్నాయి ధ్వజమెత్తారు .

డబ్బు, మద్యం దానికి ఇప్పుడు గంజాయి తోడైంది. నల్ల డబ్బు మునుపెన్నడూ ఎరుగని రీతిలో వీరవిహారం చేస్తున్నదన్నారు . ఇందులో ఆరితేరిన బిజెపి దాని అడుగుజాడల్లో నడుస్తున్న టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార తీరు అత్యంత  జుగుప్సాకరంగా ఉందన్న వేదనా పూరిత భావాలతో భారత కమ్యూనిస్టు పార్టీ ఏకీభవిస్తుందన్నారు. ఎన్నికల్లో ధన కాలుష్య విష ప్రభావంపై సిపిఐ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ఈ పూర్వరంగంలో బిజెపి పట్ల సిపిఐ అనుసరిస్తున్న సూత్రబద్ధ సైద్ధాంతిక వ్యతిరేకతను కొనసాగిస్తూనే హుజూరాబాద్ ఉపఎన్నిక తీరుపై నిరసనగా దానికి దూరంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర సమితి నిర్ణయించిందని తెలిపారు .

 

Leave a Reply

%d bloggers like this: