కేసీఆరే అధ్యక్షుడు …కేటీఆర్ మరికొద్ది కాలం ఆగాల్సిందే -రంగంలోకి దిగిన మంత్రులు!

కేసీఆరే అధ్యక్షుడు …కేటీఆర్ మరికొద్ది కాలం ఆగాల్సిందే
-రంగంలోకి దిగిన మంత్రులు
-టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మంత్రులు
-ఈ నెల 25న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక
-ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ
-23న నామినేషన్ పత్రాల పరిశీలన
-24న ఉపసంహరణకు అవకాశం

టీఆర్ యస్ అధ్యక్షుడిగా తిరిగి కేసీఆర్ నే ఎన్నుకోనున్నారు. ఈసారి యువకుడైన తనయుడు కేటీఆర్ ని టీఆర్ యస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ మళ్ళీ కేసీఆర్ నే అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు మంత్రిలు రంగంలోకి దిగారు. ఎన్నికల అధికారికి కేసీఆర్ తరుపున నామినేషన్ వేశారు.

ఈ నెల మూడో వారం నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ షురూ కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ మరుసటి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్ తరఫున తెలంగాణ మంత్రులు నేడు నామినేషన్ వేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించారు.

Leave a Reply

%d bloggers like this: