Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!
-కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
-ఎన్డీయేలో వైసీపీ కూడా చేరాలని సూచన
-ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని వెల్లడి
-కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రపరిధిలో లేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు.మూడు రాజధానుల విషయంలో ఏపీలో జరుగుతున్నా రాద్ధాంతం నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గత సంవత్సర కాలంపైగా దీక్షలు చేస్తున్నారు. ఒకపక్క కోర్టులో మూడు రాజధానులు విషయం ఉంది.శాసనసభ మూడు రాజధానులపై తీర్మానం చేసి పంపింది. కొందరు కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ కేంద్రం అభిప్రాయాన్ని అడిగింది.కేంద్ర హోమ్ శాఖ అఫిడవిట్ ద్వారా కేంద్రానికి రాజధాని విషయంలో జోక్యం ఉండదని తెలిపింది. కేంద్ర మంత్రి మాటలు కూడా దీన్నే నిర్దారించాయి.

ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కారు పేర్కొన్న నేపథ్యంలో విపక్షాలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. విభజనచట్టంలో ఒక రాజధాని అని మాత్రమే పేర్కొన్నారని విపక్షాలు ఎలుగెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు, ఎన్డీయేలో వైసీపీ కూడా చేరాలని అన్నారు. కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని అథవాలే పేర్కొన్నారు.

Related posts

రాజకీయాల గుడ్ బై… చిన్నమ్మ సంచలన ప్రకటన…

Drukpadam

ఆ నలుగురు కలెక్టర్లపై ఫిర్యాదుకు సిద్ధమైన బండి సంజయ్!

Drukpadam

టీడీపీ -జనసేన గుర్తింపు రద్దు చేయాలి :ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం -ఎమ్మెల్సీ డొక్కా..!

Drukpadam

Leave a Comment