చిరంజీవి చేతికి చికిత్స …మణికట్టుకు బ్యాండేజ్ !

కుడిచేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించా: చిరంజీవి

  • చేతికి కట్టుతో దర్శనమిస్తున్న చిరంజీవి
  • అభిమానుల ఆందోళన
  • స్పందించిన మెగాస్టార్
  • చేతికి శస్త్రచికిత్స జరిగిందని వెల్లడి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేతికి కట్టుతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి ఏమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. కుడిచేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించానని వెల్లడించారు. మణికట్టు వద్ద నరంపై ఒత్తిడి పడిందని వైద్యులు చెప్పారని తెలిపారు. దాంతో కుడిచేతికి అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారని వివరించారు. 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు.

మెగా స్టార్ చిరంజీవి చేతి మణికట్టుకు శాస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు రెండు మూడు రోజులుగా చితిమణికట్టు దగ్గర నొప్పి రావడంతో అపోలోలో పరీక్షలు చేయించుకున్నారు. ఎక్స్ రే లో మణికట్టుపై వత్తిడి పడినందున చికిత్స చేసి కట్టు కట్టడం డాక్టర్లు చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు చిరంజీవి శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. 15 రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని మెగాస్టార్ తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: