Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుసినిమా వార్తలు

జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ప్రకాశ్ రాజ్…

జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ప్రకాశ్ రాజ్…
ఇంకా ముగియని మా ఎన్నికల రగడ
పోలింగ్ రోజున తనీశ్ పై దాడి జరిగిందంటున్న ప్రకాశ్ రాజ్
జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
సీసీటీవీ ఫుటేజి కోసం పట్టు
‘మా’ ఎన్నికల సీసీ కెమెరా ఫుటేజి కావాలంటే కోర్టుకు వెళ్లండి: ఎన్నికల అధికారి కృష్ణమోహన్
కోర్టు ఏం చెబితే అది పాటిస్తానన్న ఎన్నికల అధికారి
ఇంకా ఏడు కెమెరాల ఫుటేజి ఎన్నికల అధికారి వద్దే ఉంది: ప్రకాశ్ రాజ్
ఎన్నికల అధికారి తీరుపై అసంతృప్తి
ఇవాళ కొంత ఫుటేజి పరిశీలించామన్న ప్రకాశ్ రాజ్
మొత్తం ఫుటేజి పరిశీలించాక మాట్లాడతానని వెల్లడి

మా ఎన్నికల పోలింగ్ రోజున తన ప్యానెల్ కు చెందిన తనీశ్ పై దాడి జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనీశ్ పై దాడి జరిగిన విషయం సీసీటీవీ ఫుటేజి ద్వారా బయటికి వస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

అయితే, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని, సీసీటీవీ ఫుటేజి కోసం కోర్టుకు వెళ్లమంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తమ వర్గీయులపై దాడి జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజి కీలకంగా మారింది. దీనిపై ‘మా’ ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ స్పందించారు. సీసీ కెమెరా ఫుటేజి కావాలంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. కోర్టు తీర్పును తాను పాటిస్తానని స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికలు సజావుగా నిర్వహించడం వరకే తన బాధ్యత అని, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏం జరిగిందనేది తనకు సంబంధంలేని విషయం అని వివరించారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని పేర్కొన్నారు.

మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రకాశ్ రాజ్ వర్గం ఇవాళ సీసీటీవీ కెమెరా ఫుటేజిని పరిశీలించింది. ప్రకాశ్ రాజ్, బెనర్జీ, తనీశ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో వీడియో ఫుటేజిని తనిఖీ చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

“నాకు విష్ణుతో ఇబ్బంది లేదు… సమస్య అంతా ఎన్నికల రిటర్నింగ్ అధికారితోనే. ఎన్నికల వేళ రికార్డయిన సీసీ కెమెరాల ఫుటేజి ఇవ్వాలని ఇటీవల లేఖ రాస్తే, మొదట సరే అన్నారు. ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత ఫుటేజి ఇవ్వడం కుదరదన్నారు. దానికో పద్ధతి ఉంటుందని చెబుతున్నారు. మేం దానికి తగ్గట్టుగానే వెళుతున్నాం. ఇవాళ కొంత ఫుటేజి పరిశీలించాం. ఇంకా ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వద్దే ఉంది. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు మాట్లాడతాం” అని స్పష్టం చేశారు.

Related posts

సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నానితో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ!

Drukpadam

భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు!

Drukpadam

ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారు: ఏపీ సీఐడీ

Drukpadam

Leave a Comment