టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి…

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి…
-తమ స్నేహం రాజకీయాలకు అతీతమన్న సీఎం కేసీఆర్
-కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి
-మోత్కుపల్లిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
-మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడు అని వెల్లడి
-దేశంలో అత్యుత్తమ సీఎం కేసీఆరేనన్న మోత్కుపల్లి

సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో మోత్కుపల్లి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లిని కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, మోత్కుపల్లితో తన స్నేహానుబంధం ప్రత్యేకమైనదని, రాజకీయాలకు అతీతమైనదని స్పష్టం చేశారు. తనకు అత్యంత సన్నిహితుడు అని, అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేశామని చెప్పారు. మోత్కుపల్లికి ఆరోగ్యం బాగాలేక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్సకు కోటి రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పానని కేసీఆర్ వెల్లడించారు.

అంతకుముందు మోత్కుపల్లి మాట్లాడుతూ, దేశంలోనే నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అత్యుత్తమ సీఎంకు ఉండాల్సిన లక్షణాలన్నీ కేసీఆర్ కు ఉన్నాయని కీర్తించారు. ఇవాళ ఎంతో సంతోషకరమైన దినమని పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: