టీడీపీ పై విజయవాడ ఎంపీ కేశినేని తిరుగుబాటు … చంద్రబాబు ఫోటో తొలగింపు!

టీడీపీ పై విజయవాడ ఎంపీ కేశినేని తిరుగుబాటు … చంద్రబాబు ఫోటో తొలగింపు!
తన కార్యాలయంలో చంద్రబాబు ఫొటోను తొలగించిన కేశినేని నాని
ఇతర ముఖ్య నేతల ఫొటోలు కూడా తొలగింపు
రతన్ టాటాతో కలిసున్న ఫొటోను ఏర్పాటు చేసిన వైనం
పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం

కేశినేని నాని విజయవాడ ఎంపీ …తెలుగుదేశం నుంచి గెలుపొందారు…. రాష్ట్రంలో అన్ని సీట్లు ఓడిపోతున్న సందర్భంలో గెలిచినా ముగ్గురిలో ఈయన ఒకరు. మొదటి నుంచి ఈయన వివాద స్పదంగానే ఉన్నారు.విజయవాడ నగరానికి చెందిన టీడీపీ ముఖ్యనేతలు బోండా ఉమా , బుద్ధా వెంకన్నతో సఖ్యత లేదు. కొద్దిరోజులు దూరంగా ఉన్నారు. తరువాత విజయవాడ ఎన్నికల్లో నాని కూతురును మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.చంద్రబాబు జోక్యం చేసుకొని తగాదాలు పడవద్దని అక్కడ నేతలు చెప్పారు.ఆయన వారిలో మార్పు కనిపించలేదు.ఎన్ని సార్లు తన సమస్య గురించి టీడీపీ అధినేత చంద్రబాబు కు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది.దీంతో విసుగు చెందిన నాని విజయవాడలోని తన కార్యాలయంలోని చంద్రబాబు ఫోటో ను తొలగించారు.

ఇటీవలి కాలంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఆయన పార్టీ నాయకత్వంపై అలకబూనారు. అయితే పార్టీ అధినేత, ఇతర కీలక నేతలు సముదాయించడంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. దీంతో, సమస్య సమసిపోయిందని అందరూ అనుకున్నారు. తాజాగా ఆయన వ్యవహారశైలి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ కేశినేని భవన్ లోని ఆయన పార్లమెంటు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించారు. ఆయనతో పాటు పార్టీలోని మరికొందరు ముఖ్యనేతల ఫొటోలను కూడా పక్కనపెట్టారు. చంద్రబాబు ఫొటో స్థానంలో… రతన్ టాటాతో తాను కలిసున్న ఫొటోను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధపడే ఈ పని చేశారని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెపితే ఏ పార్టీలో చేరబోతారనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది.

Leave a Reply

%d bloggers like this: