నా మిత్రుడు పువ్వాడ అజయ్ కుమార్ మామూలోడు కాదు… అనతి కాలంలోని దమ్మున్న నాయకుడిగా ఎదిగాడు మంత్రి కేటీఆర్!

నా మిత్రుడు పువ్వాడ అజయ్ కుమార్ మామూలోడు కాదు… అనతి కాలంలోని దమ్మున్న నాయకుడిగా ఎదిగాడు మంత్రి కేటీఆర్!
హైద్రాబాద్ లో కూర్చొని ఇంతమందిని రప్పించావు
అజయ్ నీ జిల్లా నాయకుల సమావేశం నిండుకుండ లాగా ఉంది
ఉమ్మడి జిల్లాలో అన్ని కమిటీల ఏర్పాటు అభినందనీయం
నీ వల్లనే ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ గ్రాఫ్ పెరిగింది.
అందువల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్ కమిటీలలో స్తానం కల్పించారు.
వరంగల్ లో జరిగే ప్రగతి గర్జన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలించాలి

ముఖ్యమంత్రి కెసిఆర్ రవాణా బాధ్యతలు ఇచ్చారు, నాతో టిఆర్ఎస్ భవన్ లోనే అన్ని నియోజకవర్గాల సమావేశాలలో కూర్చున్నావు, నువ్వు హైదరాబాదులో ఉంటూనే ఇంతమందిని ఖమ్మం నుండి రప్పించావుఅంటే మంత్రి పువ్వాడ అజయ్ ఇది మామూలు విషయం కాదు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ప్రశంసలతో ముంచెత్తిన యువనేత కేటీఆర్..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాయకులను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ పార్టీ బలోపేతం కొరకు శ్రమిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనితీరు బాగుందంటూ యువ నేత కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ప్రశంసించారు..మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీని బలోపేతం కొరకు ఏదో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ.. తన ప్రత్యేకతను చాటుకుంటున్న పువ్వాడ అజయ్ కుమార్ కు నా అభినందనలు అంటూ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అభినందించారు..

మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ పెద్దలకి, టిఆర్ఎస్ పార్టీ పై తనకున్న అంకిత భావాన్ని అతి తక్కువ సమయంలోనే పార్టీ బలోపేతం కొరకు కృషిచేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెంచిన పువ్వాడ అజయ్ కుమార్ అనతి కాలం లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ సబ్ కమిటీ లలో బాధ్యతలు అప్పగించారు.

పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సంస్థాగత నిర్మాణం లో భాగంగా నిర్దేశించిన సమయం లోపే పూర్తి స్థాయి కమిటీల నిర్మాణం కావడం సంతోషదాయకం అని కేటీఆర్ అన్నారు వరంగల్ లో వచ్చేనెల 15వ తారీకు నిర్వహించే ప్రగతి గర్జన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు హాజరయ్యే విధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు..

Leave a Reply

%d bloggers like this: