Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ …

  • పట్టాభిని అరెస్ట్ చేసిన గవర్నర్ పేట పోలీసులు
  • గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్న పోలీసులు
  • జగన్ పై వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఆయన ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. దాదాపు 200 మంది పోలీసులు పట్టాభి ఇంటి వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో ఇంట్లో పట్టాభి, ఆయన భార్య ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి పట్టాభిని అరెస్ట్ చేశారు. విజయవాడ గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్ సీఐ పేరిట వారంట్ ఇచ్చారు. ఆయనను గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్నట్టు సమాచారం. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు.

నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించలేదన్న పట్టాభి భార్య

పోలీసులపై నాకు నమ్మకం లేదు

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు… ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య మండిపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు. 

పటమట పీఎస్ లో కేసు నమోదయిందని పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో తాను, తన భర్త మాత్రమే ఉన్నామని చెప్పారు. తన భర్తకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు.

నా ఒంటిపై ఒక గాయం కూడా లేదంటూ వీడియో విడుదల చేసిన పట్టాభి.. పోలీసు కస్టడీలో చిన్న గీత పడినా జగన్ బాధ్యత వహించాలని వ్యాఖ్య!

అంతకు ముందు పట్టాభిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. పట్టాభి ఇంటి తలుపు వేసుకుని లోపలే ఉండగా పోలీసులు వచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ, వారెంట్ చూపించాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు పట్టాభి ఓ వీడియోను విడుదల చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు 200 మంది పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారని ఆయన తెలిపారు. తన ఒంటిపై చిన్న గాయం కూడా లేదంటూ శరీర అవయవాలను చూపించారు. పోలీస్ కస్టడీలో తన ఒంటికి చిన్న గీత పడినా ముఖ్యమంత్రి జగన్, డీజీపీ బాధ్యత వహించాలని అన్నారు. గతంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారని… అందుకే తాను వీడియోను చూపిస్తున్నానని చెప్పారు.

Related posts

బహుభార్యత్వం భరించాల్సిందే కానీ.. ప్రోత్సహించాల్సినది కాదు…

Drukpadam

మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో బ్యాంకుల వేల కోట్ల బాదుడు.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

గవర్నర్ తో జగన్ సమావేశం నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసమేనా ?

Drukpadam

Leave a Comment