రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష!

రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష!
-టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా 36 గంటల దీక్ష
-ధ్వంసమైన సామగ్రి మధ్యే దీక్ష చేపట్టనున్న బాబు
-అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రతిగా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు, పట్టాభి ఇంటిపై దాని నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు సిద్ధమైయ్యారు. ఆయన మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయం లో ధ్వంసం అయిన ఫర్నిచర్ మధ్యనే దీక్షను కొనసాగించనున్నారని తెలుగు దేశం వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీశాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఇప్పటికి అమిత్ షా అపాయింట్ మెంట్ ను చంద్రబాబు కోరారు. దీక్ష పూర్తీ అయిన తరువాత ఆయన నేరుగా ఢిల్లీ కి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దాన్ని భట్టి చందరబాబు ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటారు ఎవరెవరిని కలిసారు అనేది ఆశక్తిగా మారింది.

టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షను చేపట్టబోతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యే ఆయన దీక్షకు దిగనున్నారు.

మరోవైపు పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు. శనివారం ఢిల్లీకి వెళ్లి కలిసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అపాయింట్ మెంట్ కూడా కోరారు. తాజా పరిస్థితులపై అమిత్ షాకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

Leave a Reply

%d bloggers like this: