Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జనం మాట … ఇది ముమ్మాటికీ ఈటల గెలుపే గాని బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదు …..

జనం మాట …
ఇటీవల హోరా హోరీగా జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ యస్ ఓటమి కేసీఆర్ ను ఖంగు తినిపించింది… ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ యస్ ఈటల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది . …ఇది ఒకరకంగా చెప్పాలంటే అసాధారణ ఎన్నిక … దేశ చరిత్రలో ఇంత ఖర్చు పెట్టినా ఎన్నిక మరొకటి లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. కేసీఆర్ అహంకారానికి , ఈటల ఆత్మగౌరవానికి జరిగిన ఈ పోటీలో ఆత్మగౌరవాన్ని ప్రజలు ఆదరించి గెలిపించారు. ప్రజాబలం ముందు అంగ,అర్థ బలం పని చేయలేదు.

ఈటల ఘన విజయం సాధించారు …..అయితే గెలుపెవరిది ఈటల దా లేక బీజేపీ దా అనే చర్చ రాష్ట్రంలో ఆశక్తిగా నడుస్తుంది. ఇది ముమ్మాటికీ ఈటల గెలుపే కానీ బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదనే అభిప్రాయాలే బలంగా ఉన్నాయి. ఈటల నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ప్రజలకు తలలో నాలుకలాగా ఉన్నారు. ప్రతికుటంబానికి తన వంతు సహాయం అందించారని అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఈటలను చూసి ప్రజలు ఓట్లు వేశారు తప్ప బీజేపీ కి కాదని జనం మాటగా ఉంది. బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తుంది. తమ పార్టీ అభ్యర్థిగా ఈటల పోటీచేసి తమ గుర్తుపైనే గెలిచినందున బీజేపీ గెలుపే అంటున్నారు. గల్లీనుంచి ఢిల్లీ దాకా బీజేపీ ఇదే అభిప్రాయంతో ఉంది. ఒకరకంగా చుస్తే బీజేపీ వాదన కరెక్టే . టిక్నికల్ గా కూడా నిజమే ఈటల బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆపార్టీ గుర్తుపై ఎన్నికైయ్యారు. అందువల్ల బీజేపీ క్లెయిమ్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ వస్తావా పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇది బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదు . మరి బీజేపీ 2023 తెలంగాణాలో అధికారంలోకి వస్తానని అంటున్నది .ఇదెలా సాధ్యం కొన్ని ప్రత్యేక పరిస్థిల్లో మాత్రమే ప్రజలు దుబ్బాకలో , హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారు. దుబ్బాకలో రఘునందన్ రావు , హుజురాబాద్ లో ఈటల కాకుండా బీజేపీ పోటీచేస్తే ఫలితాలు వేరే విధంగా ఉండేవని అభిప్రాయాలే ఉన్నాయి. జీహెచ్ ఎంసీ లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ మంచి విజయాలు సాధించింది. అక్కడ బీజేపీ కి మొదటి నుంచి కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇక మిగతా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పెద్ద ఎత్తున మార్పు రావాలి. బీజేపీ కి ఉన్న ఓటు బ్యాంకు 7 .1 శాతం మాత్రమే ఇది అతి స్వల్పం . కాంగ్రెస్ ఓట్ల శాతం 28 .4 శాతం . అంటే బీజేపీ అహఁధికారంలోకి రావాలంటే దాని ఓట్లు ఘననీయంగా పెరగాలి . ఇది సాధ్యమేనా అనేది బీజేపీ ముందున్న సవాల్ .

టీఆర్ యస్ లో గత రెండు దశాబ్దాలుగా కీలక నేతగా , కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న ఈటలను భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ తన మంత్రి వర్గం నుంచి తొలగించారు.ఈ తొలగింపును చివరకు టీఆర్ యస్ లో ఉన్న అనేకమంది తో పాటు ప్రజలు హర్షించలేదు . పైగా అన్యాయంగా ఈటలపై వేటు వేశారనే అపవాదును కేసీఆర్ మూట కట్టుకున్నారు. ఈటలకు అన్యాయం జరిగిందనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో పాటు నడిచి అనేక కష్టాలు పడ్డ ఈటల తొలగింపును తెలంగాణ సమాజం ప్రత్యేకించి హుజురాబాద్ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. అందువల్లనే ఈటల పట్ల సానుభూతి , నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తించిన ప్రజలు అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటికీ గురికాకుండా ఈటలకు ఓట్లు వేశారు.

నిజంగా ఇక్కడ జరిగిన ఎన్నిక అసాధారణంగా జరిగిందనే చెప్పాలి … అధికార పార్టీ దళిత బందు ను తెచ్చింది…. ఇంటింటికి పదిలక్షల రూపాయలు ఇస్తున్నామని కొందరి ఖాతాల్లో జమ కూడా చేసింది అయినప్పటికీ దళితులూ కనికరం చూపలేదు . ఇతరపార్టీలలో వలసలను ప్రోత్సవించింది.కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి బీజేపీ నుంచి ఇనగాలి పెద్ది రెడ్డిని పార్టీలో చేర్చుకొని కౌశిక్ రెడ్డి కి ఆగమేఘాలమీద ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాబినెట్ ద్వారా ఆమోదం తెలిపింది. అయినప్పటికీ గవర్నర్ ఆమోదం తెలపకపోవడం గమనార్హం .వక్కల భరణం కృష్ణ మోహన్ కు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా హుజురాబాద్ కు చెందిన వ్యక్తికి ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఘననీయంగా ఉన్న ఎస్సీ ఓట్లను కొల్లగొట్టాలని ,దళితబందు పథకం తెచ్చారు. కానీ దళిత బందు దయచూపలేదు సరికదా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి దళిత బందు పతాకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన గ్రామమం లో కూడా టీఆర్ యస్ కు భంగపాటు తప్పలేదు .అయితే ముమ్మాటికీ ఇది ఈటల గెలుపే గాని బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదు …..

Related posts

టీఆర్ యస్ ను పల్లెత్తు మాట అనని అమిత్ షా ..నిర్మల్ సభలో చప్పగా సాగిన ప్రసంగం!

Drukpadam

కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై బాంబే హైకోర్టు ఆగ్రహం!

Drukpadam

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

Leave a Comment