Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుప్పం పైనే అందరి కళ్ళు …వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీ!

కుప్పం పైనే అందరి కళ్ళు …వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీ!
కుప్పం పరిసరాల్లో మంత్రులంతా మోహరించారని టీడీపీ ఫిర్యాదు
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్
వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వైసీపీ బెదిరింపులకు భయపడబోమని వ్యాఖ్య

ఏపీలో నెల్లూరు కార్పొరేషన్ తోపాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా మున్సిపాలిటీలు ఎలా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ ,టీడీపీ కన్నేశాయి. కారణం అక్కడ అసెంబ్లీ కు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించడమే . అయితే రెండు పార్టీలు ఒక్కరిపై ఒకరు ఎన్నికల సంఘానికి కుప్పం విషయంలో ఫిర్యాదులు చేసుకున్నాయి. కుప్పంలో టీడీపీ దౌర్జన్యం చేస్తుందని వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా , వైసీపీ అధికార యంత్రాగాన్ని దుర్నియోగం చేసి అడ్డదార్ల ద్వారా కుప్పాన్ని గెలుచుకోవాలని చూస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇరు పార్టీల ముఖ్యనేతలు కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు . ఎన్నికల రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కుప్పం వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఎంపీలు , కుప్పం పరిసరాల్లో మకాం వేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందరి ద్రుష్టి కుప్పం పోలింగ్ పై ఉంది. రాజకీయనేతలు కుప్పం పోలింగ్ సరళిని ఆరా తీస్తున్నారు.భారీగా పోలింగు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటరు దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో చూడాలి మరి ….

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్ నారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు 16వ డివిజన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు వేశారు.

మరోవైపు వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసిన వారిలో బొండా ఉమ, బోడె ప్రసాద్, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫొటోలు, వీడియోలతో పాటు అన్ని ఆధారాలను ఈసీకి సమర్పించామని చెప్పారు. కుప్పం పరిసరాల్లో మంత్రులంతా మోహరించారని, అయితే వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు.

Related posts

వైద్యుల బాధ్యతారాహిత్యం.. యూపీలో బాలికకు హెచ్ ఐవీ!

Drukpadam

కేంద్ర ప్రభుత్వ విధానాలతో గిరిజన హక్కులకు భంగం …జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ కు గిరినసంఘం వినతి …

Drukpadam

రఘువీరా రెడ్డి పై చిరంజీవి ప్రశంశలజల్లు…

Drukpadam

Leave a Comment