గాయపడిన సీపీఐ నారాయణకు స్వయంగా వైద్యం చేసిన వైసీపీ ఎంపీ

  • చిత్తూరు జిల్లాలో వరదలు
  • రాయల చెరువు లీకేజి అంటూ వార్తలు
  • పరిశీలనకు వెళ్లి గాయపడిన నారాయణ
  • కొండ దిగుతుండగా బెణికిన కాలు
  • ప్రథమచికిత్స చేసిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి

వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చిత్తూరు జిల్లాకు వచ్చారు. అయితే, రాయలచెరువు లీకేజి వార్తల నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన నారాయణ కాలికి గాయమైంది. కొండ దిగువకు వస్తుండగా కాలు బెణికింది. బాగా వాపు రావడంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేకపోయారు.

ఇంతలో తిరుపతి ఎంపీ, వైసీపీ నేత డాక్టర్ గురుమూర్తి అక్కడికి వచ్చి గాయంతో బాధపడుతున్న సీపీఐ అగ్రనేత నారాయణను గమనించారు. వెంటనే స్పందించిన ఆయన నారాయణ కాలికి చికిత్స చేశారు. కాలుకు కట్టుకట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వృత్తి పట్ల అంకితభావం, మంచి మనసు చూపారంటూ వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: