కరోనా బారిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. ఆరోగ్యం విషమం..

కరోనా బారిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. ఆరోగ్యం విషమం.. అపస్మారకస్థితిలో కుమారుడు!
నాలుగు రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్న శివశంకర్ భార్య
800కుపైగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ మాస్టర్
శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తా: సోనూసూద్
శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సోనూసూద్ సంప్ర‌దింపులు
శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడితో మాట్లాడిన సోనూసూద్

కొవిడ్ బారినపడి గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు చెప్పారు. శివశంకర్ భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు.

భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పదికిపైగా భాషల్లో పనిచేశారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మగధీర సినిమాలోని ‘ధీర.. ధీర..’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జ‌డ్జ్‌గా వ్యవహరించారు.

ఆయ‌న‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని సోనూసూద్

క‌రోనా సోక‌డంతో గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఇప్ప‌టికే వైద్యులు తెలిపారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై సినీ న‌టుడు సోనూసూద్ ఆరా తీశారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడు అజ‌య్‌తో ఆయ‌న‌ మాట్లాడారు. ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుని ప‌రామ‌ర్శించారు. మ‌రోవైపు, తాను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాన‌ని, ఆయ‌న‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని సోనూసూద్ ట్వీట్ చేశారు.

శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల్లో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడడం గ‌మ‌నార్హం. వారి ముగ్గురికీ ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ చిన్నకొడుకు అజయ్ కృష్ణ త‌న కుటుంబ స‌భ్యుల బాగోగుల‌ను చూసుకుంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: