స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్క ప్రకారం టీఆర్ యస్ కు ఏకపక్షమే కానీ ….

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్క ప్రకారం టీఆర్ యస్ కు ఏకపక్షమే కానీ ….
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 769 మంది
టీఆర్ యస్ కు 497 ఓట్లుకాంగ్రెస్ కు 116 , బీజేపీ కి ఒక్కరు
సిపిఐ కి 34 …సిపిఎం కు 26 ,న్యూ డెమోక్రసీ కి ఇతరులకు 74
లెక్కప్రకారం టీఆర్ యస్ కు మెజార్టీ 225 …లెక్క నిలుస్తుందా ? తప్పుతుందా ?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 10 న జరగనున్నది …. ఓట్ల లెక్కల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 497 ఓట్లతో టీఆర్ యస్ తిరుగులేని ఆధిక్యత కలిగిఉంది….కానీ లెక్కతప్పుతుందా అనే అభిప్రాయాలూ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఎన్నికపై చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే కాకుండా ఎంపీటీసీ , జడ్పీటీసీలలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. మొత్తం 769 ఓట్లలో కాంగ్రెస్ కు కేవలం 116 ఓట్లు ఉండగా సిపిఐ కు 34 ,సిపిఎం కు 26 ,బీజేపీ కి ఒకటి , న్యూడెమోక్రసీ కు ఇతరులకు కలిపి 74 ఉన్నాయి. ప్రతిపక్షాలకు అన్ని కలిపితే 250 వరకు ఓట్లు ఉన్నాయి. అంటే అధికార పార్టీకి ప్రతిపక్షాలకు తేడా 225 ఓట్ల తేడా ఉంది. లెక్క నిలుస్తుందా ? తప్పుతుందా ? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షాలు అన్ని ఐక్యంగా ఉన్నాయా ? అంటే సందేహమే . అదే సందర్భంలో టీఆర్ యస్ ఓట్లు అన్ని గంపగుత్తగా పార్టీ అభ్యర్థికి పడతాయా ? అంటే అనుమానాలు ఉన్నాయి. ఎంపీటీసీ , జడ్పీటీసీ కౌన్సిలర్లు , కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు వేయాల్సిఉంది. ప్రతిఎన్నిక కాస్టలీ కావడంతో పార్టీ ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి వారు ఎన్నికైయ్యారు. కానీ వారికి పెద్దగా గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు . ఎన్నికలు వచ్చాయి కాబట్టి మమ్ములను పలకరిస్తున్నారు లేక పొతే పట్టించుకునే నాథుడు లేడనే ఆగ్రహంగా ఉన్నారు. అందువల్ల ప్రలోభాల పర్వం కొనసాగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఓట్ల కోసం సొంత పార్టీ సైతం వారిని ప్రసన్నం చేసుకోక తప్పదు . అయినప్పటికీ ఓట్లు ఏకపక్షంగా పడతాయా ? లేదా అనే సందేహాలు ఉన్నాయి . టీఆర్ యస్ నుంచి తాతా మధు , కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వర్ రావు లు పోటీ పడుతున్నారు. ఇద్దరిది ఒకే సామజిక వర్గం కావడం గమనార్హం .

ప్రయత్నం ఒకరిదిఫలితం మరొకరిది

ఖమ్మం ఎమ్మెల్సీ కోసం అనేక మంది పోటీ పడినప్పటికీ తాతా మధును సీఎం కేసీఆర్ ఎంపిక చేయడం వెనక అనేక ట్విస్టులు ఉన్నాయి …జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు చివరివరకు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నం చేశారని అయితే అందుకు కేసీఆర్ నిరాకరించారని ప్రచారం జరుగుతుంది. సామాజికవర్గాల సమీకరణలో ఒక కీలక నేత గట్టిగా ప్రయత్నం చేయగా తాతా మధుకు కలిసొచ్చింది. అనేక మంది ఉద్దండులు ఖమ్మం ఎమ్మెల్సీ సీటు ఆశించారు . తెలంగాణ అసెంబ్లీ లో కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం , ఆయనకు అయాచిత వరంలా మారింది. దీనికి తోడు టీఆర్ యస్ లో కీలక నేతగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులతో ఒకరిగా గుర్తింపు ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అండదండలు మధుకు పుస్కలంగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. మధు గురించి రాజేశ్వర్ రెడ్డి తో పాటు ఎంపీ సంతోష్ కుమార్ లు కేసీఆర్ కు చెప్పారని దీంతో ఆయన మధు అభ్యర్థిత్వంపై మొగ్గుచూపారని తెలుస్తుంది .

అభ్యర్థి ఎంపిక సందర్భంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు మాజీ మంత్రి తుమ్మల పేరు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకుపోయారని ,దానికి సీఎం సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. అంతే కాకుండా జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతలపై కేసీఆర్ భగ్గుమన్నారని గుసగుసలు వినిపించాయి. మధు ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ చాల సానుకూలత వ్యక్తం చేశారని , ఆయన నిబద్దత , అంకితభావం , నిర్మాణం దక్షతపై ప్రసంశలు కురిపించారని సమాచారం. మరి ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితం ఎలాఉంటుందో చూడాలి ….

Leave a Reply

%d bloggers like this: