Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బిగ్ బాస్ షోకు రాజకీయ సెగ …రవి ఎలిమినేషన్ పై నిరసనల వెల్లువ!

బిగ్ బాస్ షోకు రాజకీయ సెగ …రవి ఎలిమినేషన్ పై నిరసనల వెల్లువ!
-రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటున్న బీజేపీ ఎమ్మెల్యే
-బిగ్ బాస్-5 నుంచి రవి ఎలిమినేషన్
-మండిపడుతున్న అభిమానులు
-స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
-అమిత్ షాకు లేఖ రాస్తానని వెల్లడి
-బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ వ్యాఖ్యలు

బిగ్ బాస్ షో కు రాజకీయ సెగ తగిలింది. రవి ఎలిమినేషన్ ఫెయిర్ కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి కి ఫిర్యాదు చేస్తానని ఈ షో రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. యాంకర్ రవి ఎలిమినేషన్ పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇది ఫెయిర్ గేమ్ కాదని అంటున్నారు. షో లో రవి అందరికంటే మంచి గేమ్ ఆడటం జరిగిందని అయినప్పటికీ ఎలిమినేట్ కావడంపై అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. బిగ్ బాస్ షో నుంచి రవి వస్తున్నా సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో రవి కంటే ముందుగానే బయటకు వచ్చిన లోబో , జస్సు ,విశ్వ , ఉమా తదితరులు కూడా పాల్గొన్నారు.

బిగ్ బాస్-5 రియాల్టీ షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెసెంట్లతో పోల్చితే యాంకర్ రవి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది. అయితే, నిన్నటి ఎపిసోడ్ లో రవి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఇది అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ వారం కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటపెట్టాలని వారు బిగ్ బాస్ నిర్వాహకులను నిలదీస్తున్నారు. మరొకరిని సేవ్ చేసేందుకు రవిని బలి చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. రవి ఎలిమినేషన్ పై తమకు అనుమానాలు కలుగుతున్నాయని, దీని వెనుక ఏదైనా కుట్ర జరిగివుంటుందని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బయటికి పంపించి వేయడం ద్వారా వివాదం సృష్టించాలనుకుంటున్నారా? అని రాజా సింగ్ బిగ్ బాస్ నిర్వాహకులను ప్రశ్నించారు.

దీనిపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని, తెలుగు బిగ్ బాస్ షోతో పాటు, హిందీ బిగ్ బాస్ షోను సైతం నిషేధించాలని కోరతానని తెలిపారు. అసలు, బిగ్ బాస్ షోలో ఏంజరుగుతోందో అర్థంకావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

Related posts

జగన్ తీరుతో పులివెందులకూ చెడ్డపేరు: చంద్రబాబు!

Drukpadam

కేసీఆర్ ప్రధాని మోదీకి కోవర్టు… రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!

Drukpadam

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. 62 మంది ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం!

Drukpadam

Leave a Comment