బ్రోకర్లు, కబ్జాకోర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతారు: ఈటల రాజేందర్!

బ్రోకర్లు, కబ్జాకోర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతారు: ఈటల రాజేందర్!
-టీఆర్ఎస్ లో భజనపరులకు మాత్రమే చోటు ఉంటుంది
-పేదలకు కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు
-ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏమిస్తారు?

సీఎం కేసీఆర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు.ఈరోజు ఆయన పాల్వంచలో పర్యటించారు. పట్టణంలోని తెలంగాణ నగర్ లో ఈటలకు స్థానికులు స్వాగతం పలికారు. కేసీఆర్ కు పేదల భాదలు తెలవవని ఆయన కేవలం బ్రోకర్లు , కబ్జాకోర్లు , ధనవంతుల పక్షాననే పని చేస్తారని దుయ్యబట్టారు .టీఆర్ఎస్ లో కేవలం భజనపరులకు మాత్రమే చోటు ఉంటుందని అన్నారు. అన్ని మోసం మాటలు ,టక్కరి మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమిలేదని అన్నారు. కేసీఆర్ ప్రజలను అమాయకులు అనుకుని డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గద్దెను అట్టిపెట్టుకోవాలనే ఏకైక పథకంతో ఉన్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ లో చైతన్యవంతమైన ప్రజలు ఆయన డబ్బులను పక్కన పెట్టి కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ కేసీఆర్ కు బుద్ది రాలేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే , జాగాలు కాదు అసలు ఇళ్ళే కట్టించి ఇస్తానని చెప్పారని అవికూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అసలు ఇళ్ళే లేకుండా చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కన పెట్టి ఉద్యమం తో సంబంధంలేని వారిని అందలం ఎక్కించారని ఇదేనా నీనీతి అని ప్రశ్నించారు. కేసీఆర్ మోసపు మాటలు ,అబద్దాల బతుకులు ఇంకా ఎంతోకాలం సాగవని ఈటల అన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… తెలంగాణ నగర్ లో నిరుపేదలే ఉంటారని… అందుకే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పేదల పక్షాన కేసీఆర్ ఉండరని… వందల ఎకరాలను ఆక్రమించుకున్నవారు, ధనవంతులు, బ్రోకర్లకు వత్తాసు పలుకుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలు ఇవ్వని కేసీఆర్… డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏమిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని జోస్యం చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: