Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ ను తాకిన ఓమిక్రాన్ …బెంగుళూర్ లో ఇద్దరికీ !

భారత్ ను తాకిన ఓమిక్రాన్ …బెంగుళూర్ లో ఇద్దరికీ !
కర్ణాటకలో ఒమిక్రాన్ బాధిత డాక్టర్ ను కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్
భారత్ లో ఒమిక్రాన్ కలకలం
కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
వారిలో ఒకరు దక్షిణాఫ్రికా వెళ్లిపోయిన వైనం
మరో డాక్టర్ కి కూడా ఒమిక్రాన్
విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం

ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ భారత్ ను తాకింది. బెంగుళూర్ లో ఇద్దరికీ ఈ లక్షణాలు ఉన్నట్లు నిర్దారణ కావడం కలకలం రేపింది. ఓమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తమైన భారత్ ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. అయినప్పటికీ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించకుండా చేయలేక పోయారు. అయితే బెంగుళూరు లో ఒకవ్యక్తి తరుచు దక్షిణాఫ్రికా వెళ్లి వస్తుంటారని , అతనికి దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉందని సమాచారం . ఆతను తిరిగి దక్షిణాఫ్రికా వెళ్లి పోయారు. మరో వ్యక్తికి ఎలాంటి సంబంధం లేకుండానే వైరస్ సోకడంపై ఆరా తీస్తున్నారు.

భారత్ లోనూ ఒమిక్రాన్ ప్రవేశించిందన్న కేంద్రం ప్రకటనతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ లో వెల్లడైన రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 66 ఏళ్ల వయసున్న వ్యక్తి అని, అతడు దక్షిణాఫ్రికా పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటీవలే అతడు తిరిగి దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు.

మరో వ్యక్తి 46 ఏళ్ల వైద్యుడు అని, ఇప్పుడా డాక్టర్ ను కలిసిన వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన డాక్టర్ కు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని మంత్రి వివరించారు. ఆయనను కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లకు విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, డాక్టర్ సహా వారందరినీ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచామని పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని, వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని మంత్రి తెలిపారు.

Related posts

ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు!

Drukpadam

డెల్టా ముప్పున్నా ఆంక్షలన్నింటినీ ఎత్తేసిన ఇంగ్లండ్​.. మాస్క్​ కూడా అక్కర్లేదట!

Drukpadam

దుబాయ్ నుండి డిల్లీకి వచ్చిన పదిమందికి ఒమైక్రాన్…

Drukpadam

Leave a Comment