మల్లాది వాసు సారీ !…..వల్లభనేని వంశీ పశ్చాతాపం!!…

మల్లాది వాసు సారీ …..వల్లభనేని వంశీ పశ్చాతాపం
కమ్మ వారివనసమారాధన లో రెచ్చిపోయిన మల్లాది వాసు
వంశీ , కొడాలినాని , అంబటి రాంబాబు లను అంతం చేస్తే 50 లక్షలు అన్న వాసు
చంద్రబాబు భార్యపై వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ
తాను ఎమోషనల్ గా అన్నానని పశ్చాతాపం వ్యక్తం చేసిన వంశీ

తాను మధిరలో జరిగిన కమ్మ వారి వనసమారాధన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు సారీ చెప్పారు. తాను కావాలని అనలేదని ఎదో మాటల్లో దొర్లినా పొరపాటని అలా అనకుండా ఉండాల్సిందని అన్నారు. తాను ఎవరిని చంపాలని ప్రోత్సహించడంలేదని అన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే నిజంగా సారీ చెపుతున్నానని ఇంతటితో ఈ విషయం ముగించాలని వేడుకుంటున్నానని అన్నారు. అంతకు ముందు మధిరకు ఒక ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయ బాను మాట్లాడుతూ మల్లాది వాసు మాటలపై ఫైర్ అయ్యారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను మంత్రిని అంతం చేస్తే 50 లక్షలు ఇస్తానని ప్రకటించడం పై మండిపడ్డారు. ఒక వేళ డబ్బులు ఉన్నాయని మదమెక్కి మాట్లాడం సరికాదన్నారు . వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేకపోతె నాలుక చీరేస్తామని హెచ్చరించారు.

ఇది ఇలా ఉండగా చంద్రబాబు భార్యపై తానే కామెంట్ చేశానని అయితే దానికి తాను పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానని వల్లభనేని వంశీ చెప్పడం ఆశక్తిగా మారింది. భవనేశ్వరి అంటే తనకు ఏంతో గౌరమని ఆమె అక్క అని పిలుస్తానని వంశీ అన్నారు. కావాలని అనలేదని ఎమోషనల్ గా అన్నానని అన్నారు. అయితే అదే సందర్భంలో చంద్రబాబు ఎంతమంది ఆడవాళ్లపై కామెంట్ చేయలేదు …చేశారు కదా ? చివరికి ప్రధాని తల్లి భార్యపైకూడా కామెంట్ చేసింది, వాస్తవం కదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తో కలిసి పని చేసిన తమకు ఆయన నైజం గురించి తెలుసునని అన్నారు. ఎవరికో భయపడి తాను పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నిజంగా ఫీల్ అయినందునే చెబుతున్నానని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: