Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజీవ్ స్వగృహాలను మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలి…సిపిఎం

రాజీవ్ స్వగృహాలను మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలి.
స్వగృహ ఇళ్లను పరిశీలించిన సిపిఎం బృందం
స్వగృహ ఇళ్లపై ప్రైవేట్ టెండర్లు పిలిస్తే అడ్డుకుంటాం.

ఖమ్మంపట్టణాన్ని అనుకుని ఉన్న మున్నేరు పక్కన పోలేపల్లి రెవెన్యూ లో నిర్మించిన రాజీవ్ స్వగ్రహ గృహాలు ఎవరికీ కేటాయించకుండా నిస్తేజంగా పడి ఉన్నాయి. వాటిని ఉచితంగా కాకుండా సరసమైన ధరలకు మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలనే డిమాండ్ ఉంది . ప్రభుత్వాలు మారాయి. చివరకు కొత్త రాష్ట్రం కూడా ఏర్పడింది. కానీ రాజీవ్ స్వగృహ పేరుతో నిర్మించిన పెద్ద పెద్ద టవర్స్ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మధ్యతరగతి ఉద్యోగులకోసమని వీటిని నిర్మించారు. కానీ లక్ష్యం నెరవేరలేదు . కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన టవర్స్ సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు వీటిపై ద్రుష్టి సారించకపోవడం దారుణమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. సిపిఎం దీనిపై ఫోకస్ పెట్టింది. వీటిని మధ్యతరగతి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తుంది.

ఖమ్మం నగరంలో సుమారుగా పది సంవత్సరాల క్రితం నిర్మించిన 756 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ లను వెంటనే మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం నిర్మానుష్యంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది ప్రజా సొమ్ము తో నిర్మించిన గృహాలు చిరుద్యోగులకి కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ అందించకుండా దశాబ్దాలుగా వదిలివేయటం సరైంది కాదన్నారు. ఖమ్మం నగరంలో అనేక మంది మధ్య తరగతి ప్రజలు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒకపక్క మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను శిథిలావస్థకు చేరుకున్న కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. శిథిలావస్థలో ఉన్న స్వగృహా లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని వారు తెలిపారు. తక్షణమే గృహాలను అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలిచి అప్పనంగా అప్పచెప్పే ప్రక్రియ చేస్తే టెండర్ ప్రక్రియను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ ల పై నిర్ణయం తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, వై. విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు నండ్రా ప్రసాద్, ఎం.ఎ జబ్బార్, ఎస్. నవీన్ రెడ్డి, దొంగల తిరుపతిరావు, టు టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్ , త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను, అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మార్పు లేదు యడియూరప్పే ముఖ్యమంత్రి.. పునరుద్ఘాటించిన కర్ణాటక బీజేపీ ఇన్‌ఛార్జి…

Drukpadam

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు పై పుకార్లు…

Drukpadam

కోమటిరెడ్డి వెంకట్రెడ్డివి కోవర్ట్ రాజకీయాలే …పాల్వాయి స్రవంతి విమర్శ !

Drukpadam

Leave a Comment