స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ యస్ కు క్రాస్ ఓటింగ్ భయం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ యస్ కు క్రాస్ ఓటింగ్ భయం
-టీఆర్ యస్ శిభిరంలో అసమ్మతి స్వరాలు
-డబ్బుల పంపిణీలో పక్షపాతం అంటూ ప్రచారం
-స్టార్ హోటల్ లో ఎంపీటీసీలు ,జడ్పీటీసీలు తిరగబడ్డారని గుప్పుమన్న వార్తలు
-ఎమ్మెల్యేల స్తబ్దత …ప్రచారంకు సీనియర్లు దూరం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఐదు జిల్లాల పరిధిలోని 6 స్థానాలకు జరగనున్న ఎన్నికలు అధికార టీఆర్ యస్ కు సవాల్ గా మారాయి. ప్రత్యేకించి ఖమ్మం , కరీంనగర్ , ఆదిలాబాద్ , మెదక్ లాలలో అధికార పక్షాన్ని సొంతపార్టీ ఓటరు ఇబ్బంది పెట్టనున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇక్కడ అధికార పార్టీ పై పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . అయితే ప్రతిపక్షపార్టీలు కావాల్సినంత బలం లేదు . కేవలం అధికార పక్ష సభ్యుల అసమ్మతిపైనే ఆధారపడి పోటీ చేస్తున్నాయి. దీంతో సొంత పార్టీ ఎంపీటీసీ , జడ్పీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. వారిని క్యాంపులకు తరలించి , రేపు ఉదయం ఆర్ డి ఓ కార్యాలయాల్లో జరిగే పోలింగు కేంద్రాలకు నేరుగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం ఓట్లర్లు గోవా నుంచి హైద్రాబాద్ చేరుకున్నారు. అక్కడనుంచి మంత్రి పువ్వాడ ఆధ్వరంలో వారు ఖమ్మం చేరుకుంటారు . గోవా లోను తరువాత హైదరాబాద్ లో ఎంపీటీసీల పట్ల వివక్ష చూపించారని , కులాలవారీగా సౌకర్యాలు కల్పించారని,ఓటర్లకు డబ్బుల పంపిణీలో కూడా నియోజకవర్గానికి ,నియోజకవర్గానికి మధ్య వ్యత్యాసం చూపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఓటర్లు రగిలిపోతున్నారని సోషల్ మీడియా లో పోస్టింగులు వైరల్ అవుతున్నాయి.  అంతే కాకుండా ఎమ్మెల్యేలు స్తబ్దత గా ఉన్నారు. సీనియర్లు ఎన్నికల ప్రచారం లో దూరంగా ఉన్నారు. టీఆర్ యస్ లో ఏమి జరుగుతుందో అంతు పట్టకుండా ఉందని కొందరు పార్టీ నేతలే అంటున్నారు.

“హైదరాబాద్ లో ఓక స్టార్ హోటల్ ఉన్న ఖమ్మం టీఆర్ యస్ శిబిరంలో గందరగోళం ఇప్పటికే ఓటర్ల ఫోన్ తీసుకోవడంతో ఆయో మయంలో పడ్డ ఓటర్లు మేము ఏమన్నా దొంగలమా అని తిరగ బడ్డా కార్యకర్తలు ఎంపీటీసీలు ఒక్కసారిగా ఖంగుతిన్న నాయకులు డబ్బులు కూడా ఒక నియోజకవర్గం కి ఒకలగా మరొక నియోజకవర్గ నికి మరోలగా ఇవ్వటం ఏమిటి అని ప్రశ్నించిన ఓటర్లు…. ఐదు లక్షల రూపాయలు ఇస్తేనే ఓటు అని లేకపోతె మేము ఓటు వేయము అని మేము మా సొంత గా ఖమ్మం పోతామని నాయకుల మొకమ్మిదే చెప్పిన ఎంపీటీసీలు ఈ పరిణామం తో ఒక్కసారిగా ఉలిక్కిపడిన టీఆర్ యస్ అధిష్టానం . ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ తీవ్రంగా దూకుడు పెంచారు ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఖమ్మంలో రాజకీయం రసవత్తరంగా మారింది రాయల గెలుపు కాయంగానే కనపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు” అని సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్టింగ్ వైరల్ అవుతుంది.

Leave a Reply

%d bloggers like this: