Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాకు దన్నుగా కెనడా నిర్ణయం …బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ కు దౌత్య బహిష్కరణ!

అమెరికాకు దన్నుగా కెనడా నిర్ణయం …బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ కు దౌత్య బహిష్కరణ!
-బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు.. దౌత్య బహిష్కరణ జాబితాలో ఐదు దేశాలు
-ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా నాలుగు దేశాలు
-మానవహక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ తీరుకు నిరసనగానేనన్న కెనడా
-రేపో, మాపో ఫ్రాన్స్ కూడా నిర్ణయం

చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవహక్కుల ఉల్లంఘన వంటి ఆరోపణలపై గుర్రుగా ఉన్న పలు దేశాలు వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియా ఇలాంటి నిర్ణయమే తీసుకోగా, తాజాగా కెనడా కూడా ఆ దేశాల బాటలోనే నడిచింది. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తెలిపారు. ఇప్పటివరకు నాలుగు దేశాలు ఈ లాంటి నిర్ణయం తీసుకోగా కెనడా ఐదు దేశం అయింది. మరికొన్ని దేశాలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాయి. దీంతో క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు క్రీడలు జరుగుతాయా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఫ్రాన్స్ కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయి. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆ దేశాలు పేర్కొంటున్నాయి.

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో తమ దేశం తరపున అధికారులు కానీ, రాయబారులు కానీ పాల్గొనబోరని స్పష్టం చేశారు. అయితే, క్రీడాకారులు మాత్రం పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని గత నాలుగు నెలలుగా పరిశీలిస్తున్నామని, భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కెనడా తాజా నిర్ణయంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన దేశాల సంఖ్య ఐదుకు పెరిగింది. కాగా, ఈ విషయంలో తాము కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఫ్రాన్స్ తెలిపింది.
అసలు బీజింగ్ లో క్రీడలు జరుగుతాయా లేదా ? అయితే చైనా ఎదిగా స్పందిస్తుందో చూడాలి
!

Related posts

స్వలింగ వివాహాలను గుర్తించబోమన్న కేంద్రం!

Drukpadam

రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు!

Drukpadam

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేందపకు తనవంతు సహకారం.స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

Drukpadam

Leave a Comment