బంగ్లాదేశ్ లో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష !

బంగ్లాదేశ్ యూనివర్సిటీలో క్యాంపస్ హత్యకేసు.. 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించిన కోర్టు

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థి ఫేస్‌బుక్ పోస్టు
  • ఫవాద్‌ను జమాతే ఇస్లామీ స్టూడెంట్ ఫ్రంట్ కార్యకర్తగా అనుమానించిన అవామీలీగ్ విద్యార్థులు
  • క్యాంపస్‌లోనే దారుణ హత్య
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఓ హత్య కేసులో బంగ్లాదేశ్ ట్రయల్ కోర్టు ఒకటి సంచలన తీర్పు చెప్పింది. క్యాంపస్ హత్యకేసు ఘటనలో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (బీయూఈటీ)లో సెకండియర్ చదువుతున్న 21 ఏళ్ల అబ్రార్ ఫహాద్ 2019లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.

దీంతో అతడిని జమాతే ఇస్లామీకి చెందిన స్టూడెంట్ ఫ్రంట్ కార్యకర్తగా అనుమానించిన అవామీలీగ్ పార్టీ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ చాత్ర లీగ్ (బీసీఎల్) కార్యకర్తలు ఫహాద్‌ను హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

మరోవైపు, హత్య తర్వాత నిందితులైన 20 మంది కార్యకర్తల సభ్యత్వాలను బీసీఎల్ రద్దు చేసింది. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెల్లడించిన ట్రయల్ కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. 20 మందికి మరణశిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Leave a Reply

%d bloggers like this: