చంద్రబాబు ,దగ్గుపాటి కలిసిన వేళ!

  • చాలా రోజుల తర్వాత కలిసిన నారా, దగ్గుబాటి ఫ్యామిలీలు
  • ఒకే ఫ్రేమ్‌లో తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వరరావు
  • రాజకీయం వేరు, కుటుంబం వేరు అంటూ కామెంట్స్

నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేర్లు. ఎన్టీఆర్‌కు అల్లుళ్లుగానే కాకుండా రాజకీయాల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత రాజకీయపరమైన విభేదాలతో ఇద్దరూ వేరు, వేరు పార్టీల్లో ఉన్నారు. అయితే రాజకీయాలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ ఇద్దరు చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశారు.. అందరితో సరదాగా గడిపారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తోడల్లుళ్లు, అక్కాచెల్లెళ్లు కనిపించడం అదిరిపోయిందంటున్నారు.

ఎన్టీఆర్ మనవరాలు( చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు) వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆమెను పెళ్ళికుమార్తెను చేసిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటూ చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు ఆశీర్వదించారు. కుటుంబం మొత్తం కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేశారు.. రాజకీయం రాజకీయమే .. ఫ్యామిలీ ఫ్యామిలీనే అంటున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చింది. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: