కోహ్లీ స్థానంలో రోహిత్ ను కెప్టెన్ గా నియమించడానికి కారణం ఇదే: గంగూలీ!

కోహ్లీ స్థానంలో రోహిత్ ను కెప్టెన్ గా నియమించడానికి కారణం ఇదే: గంగూలీ!
-టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి చెప్పాం
-టీ20, వన్డేలకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదు
-అందుకే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ గా చేశాం

టీం ఇండియాకు కొత్తగా కెప్టెన్ ను నియమించడం పై వివాదం నెలకొన్నదానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చేశారు. కోహ్లీ కి టీ 20 కెప్టెన్ నుంచి తప్పుకోవద్దని చెప్పమని అయినప్పటికీ ఆయన వినలేదని తెలిపారు. అదే సందర్భంలో టీ 20 కి వన్ డే మ్యాచ్ లకు వేరువేరుగా కెప్టెన్ లను నియమించడం సరికాదు అందువల్లనే రెండు పార్మెట్లకు ఒకే కెప్టెన్ ను నిమించక తప్పింది కాదు . అదే సందర్భంలో రోహిత్ అందుకు అన్ని విధాలా సమర్థుడుగా మాకు కనిపించాడు అందువల్ల రోహిత్ ను నియమించాం అని గంగూలీ చెప్పారు .

ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ ఆయనను తప్పించింది. ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీపై కోహ్లీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమ్ లో అందరి కంటే సీనియర్ అయిన, ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పుపై గంగూలీ స్పందించాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి తాము ఎంతగానో చెప్పామని… అయినా ఆయన వినలేదని గంగూలీ తెలిపాడు. వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్లు నాయకత్వం వహించడం సరికాదని… టీ20, వన్డేలకు ఒకరే కెప్టెన్ గా ఉంటే బాగుంటుందని తాము భావించామని చెప్పాడు. ఈ కారణం వల్లే వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించామని తెలిపాడు. టెస్ట్ లకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతారని పేర్కొన్నారు.

ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారు: మాజీ సెలెక్టర్ సబా కరీమ్

  • 2017లో కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించాడు
  • కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడింది
  • ఈ నాలుగు టోర్నీల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదు
Saba Karim tells the reason behind termination of Virat Kohli as captain
దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్తున్న టీమిండియా జట్టు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించింది. దీంతో టీ20, వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ ప్రమోట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్ గా మాత్రమే కొనసాగనున్నాడు. మరోపక్క, వన్డే కెప్టెన్ గా కోహ్లీని తొలగించడంపై ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై పలువురు మాజీలు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, 2012లో టీమిండియా సెలెక్టర్ గా ఉన్న సబా కరీమ్ ఈ అంశంపై స్పందించారు.

గత నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయిందని… ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారని సబా కరీమ్ అన్నారు. 2017లో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారని చెప్పారు. కోహ్లీ కెప్టెన్ గా భారత్ నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడిందని… వీటిలో రెండు టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోయామని, ఒక్క టోర్నీలో సెమీస్ లో వెనుదిరిగామని తెలిపారు. ఒక్క టోర్నీని కూడా గెలవకపోవడం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: