Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో టోర్నడో విలయతాండవం… 100 మంది బలి!

అమెరికాలో టోర్నడో విలయతాండవం… 100 మంది బలి!

  • కెంటకీ సహా పలు ప్రాంతాల్లో టోర్నడో పంజా
  • తీవ్ర స్థాయిలో ఆస్తినష్టం
  • నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఫ్యాక్టరీ
  • అంధకారంలో 3 లక్షల మంది

అగ్రరాజ్యం అమెరికాలో తరచుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. హరికేన్లు, కార్చిచ్చులు తీవ్రస్థాయిలో వినాశనానికి దారితీస్తుంటాయి. వీటికితోడు టోర్నడోలు సైతం అమెరికా ప్రజలను అతలాకుతలం చేస్తుంటాయి. ప్రచండ వేగంతో గాలి గిరికీలు కొడుతూ అడ్డొచ్చిన ప్రతి దాన్ని తుత్తునియలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అమెరికాలో టోర్నడోల ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తుంటుంది.

తాజాగా కెంటకీ రాష్ట్రంలో ఓ భారీ టోర్నడో తీవ్ర ప్రాణనష్టం కలిగించింది. దీని ధాటికి 100 మందికి పైగా బలయ్యారు. వీరందరూ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు అని తెలుస్తోంది. టోర్నడో వచ్చిన సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది వరకు ఉన్నారు. ఈ టోర్నడో కారణంగా తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది. కెంటకీ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి టోర్నడో రాలేదని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.

ఇల్లినాయిస్, ఆర్కన్సాస్ ప్రాంతాల్లోనూ టోర్నడో ప్రభావం కనిపించింది. ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీ, అమెజాన్ గోడౌన్, ఓ ఆసుపత్రి నామరూపాల్లేకుండా పోయాయి. టోర్నడో తీవ్రతకు విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో 3 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు.

Related posts

7 Easy Hairstyles to Complete Your Fall Outfits

Drukpadam

ఏపీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో సుప్రీం సంచలన తీర్పు!

Drukpadam

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురుపై కేసు నమోదు…

Drukpadam

Leave a Comment