Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీలో 2వ రోజు దండోరా ధర్నా …

ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీలో 2వ రోజు దండోరా ధర్నా …
అడ్డుకున్న పోలీసులు …
ఎస్సీ లను వర్గీకరించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలి
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో 2వ రోజు దండోరా ధర్నా చేశారు. ఢీల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో మాదిగ హక్కుల దండోరా ధర్నా కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాదిగ , జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ , రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ , వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదాసి భాస్కర్ మాదిగ , ఎం ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కొంగర్ శంకర్ మాదిగ , మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ధర్నాలో పాల్గొన్నారు .

అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్య , ఉద్యోగ , రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారని , వెనుకబడ్డ మాదిగలకు న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్లను ఎ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ రెండున్నర దశాబ్దాలకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యమం నడుస్తుందని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 1997వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రాంచందర్ రాజు కమీషన్ ను నియమించిందని , అ కమీషన్ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా నివేదికను సమర్పించిందని , అ నివేదికను ఆధారం చేసుకొని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీచేసింది . 2000 సంవత్సరం నుండి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది . ఆ కాలంలో విద్య , ఉద్యోగ రంగాలలో మాదిగ , మాదిగ ఉపకులాలు అవకాశాలు పొందగలిగారు . కావున ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కొద్దిమంది సుప్రీం కోర్టు అశ్రయించడం వల్ల సాంకేతిక కారణాల సాకు చూపి 2004వ సంవత్సరంలో వర్గీకరణను సుప్రీం కోర్టు రద్దు చేసింది . రద్దు చేస్తూ పార్లమెంటు ద్వారా చట్టం చేసుకోవాలని సూచన చేసింది . సుప్రీం కోర్టు సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు . మాదిగల ఉద్యమ ఫలితంగా 2007 వ సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం జస్టిస్ ఉషామోహ్రా కమిషన్ ను నియమించింది . అ కమీషన్ విస్తృతంగా పర్యటించి ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి 2008వ సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ పార్లమెంట్ ద్వారా చట్టం చేయమని సూచన చేసింది . ఆ నివేదిక ఆధారంగా ఎస్సీల వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశాయి . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 3 సార్లు , తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణకు ఎకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు . గతం నుండి ఇప్పటివరకు వర్గీకరణకు తాము అనుకూలంగా ఉన్నామని బిజెపి అనేక వేదికల మీద ప్రకటనలు చేసింది . మరోపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని వర్గీకరణ సాధించే బాధ్యత నాదేనని నిండు అసెంబ్లీలో ప్రకటించారు . ఈ ప్రకటన చేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదు . ఇప్పటికైన అఖిలపక్ష బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని , గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నాచౌక్లో నిరసన చేస్తున్న దండోరా నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు .

Related posts

హైద్రాబాద్ లో రాహుల్ పర్యటన కాక!

Drukpadam

వరుసలో నిలుచుని.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన రాహుల్ గాంధీ!

Drukpadam

ఖమ్మం లో కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వనున్న ఇద్దరు కార్పొరేటర్లు!

Drukpadam

Leave a Comment