Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు!

షర్మిల దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ షర్మిల దీక్ష
  • కోటి రూపాయల పరిహారం ఇచ్చేంత వరకు దీక్ష కొనసాగుతుందన్న షర్మిల
  • షర్మిల, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం బొగుడ భూపతిపూర్ కు చెందిన రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వరి వేసుకోకపోతే ఉరే వేసుకోవాలని కేసీఆర్ కు లేఖ రాసి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రవి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని… పరిహారం ఇచ్చేంత వరకు తన నిరాహారదీక్ష కొనసాగుతుందని చెపుతూ ఆమె దీక్షకు కూర్చున్నారు. ఆమె దీక్ష దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన తర్వాత పోలీసులు దీక్షను భగ్నం చేశారు.

Related posts

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు:ఈటలకు డిప్యూటీ సీఎం… టీఆర్ యస్ ఆఫర్ చేసిందంటూ కథనాలు …

Drukpadam

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సెటైరికల్ ప్రెస్ మీట్…ఆద్యంతం ఆశక్తి …

Drukpadam

Leave a Comment