వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

  • వారణాసిలో మోదీ పర్యటన
  • పవిత్ర గంగా స్నానం చేసిన ప్రధాని
  • కాశీ విశ్వనాథ్ ధామ్ సందర్శన
  • కార్మికులతో సహపంక్తి భోజనం

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించారు. ప్రాచీన నగరంగా గుర్తింపు పొందిన వారణాసికి ఈ మెగా ప్రాజెక్టుతో పర్యాటకపరంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని భావిస్తున్నారు. విఖ్యాత కాశీ విశ్వేశ్వరుడి ఆలయం చుట్టూ నిర్మించిన ఈ కారిడార్ లో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు పొందుపరిచారు.

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పవిత్ర గంగానదిలో స్నానమాచరించారు. భరతమాత, రాణి అహల్యబాయి హోల్కర్ విగ్రహాలకు నీరాజనాలు అర్పించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట రాగా కాశీ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్ లో కలియదిరిగారు. అంతేకాదు, కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పేరుపేరునా పలకరించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

Leave a Reply

%d bloggers like this: