కేసీఆర్ కు మల్లి కేంద్రం పై కోపం వచ్చింది…

కేసీఆర్ కు మల్లి కేంద్రం పై కోపం వచ్చింది…
బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు
రేపు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ
బీజేపీయేతర నాయకులతో సంభాషణ
పీకే టీం తో కూడా మంతనాలు …పీకే తో కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రంలోని బీజేపీ పై కోపం వచ్చింది. దీంతో తిరిగి ప్రత్యాన్మాయ రాజకీయాలవైపు ద్రుష్టి సారించారు. తెలంగాణాలో వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మోసం చేసిందని కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీఆర్ యస్ ఎంపీలు సైతం పార్లమెంట్ సమావేశాల్లో రచ్చ రచ్చ చేశారు. చివరకు సమావేశాలను బహిష్కరించారు. ఇప్పుడు కేంద్ర రాజకీయాలపై ఆయన ఫోకస్ పెట్టారు. గతంలో రెండు సార్లు ఢిల్లీ లో మకాం వేశారు. అనేక మంది రాజకీయనేతలు రహస్యంగా కలిశారు. వారింటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఆలోచనలు చేసినట్లు సమాచారం . గత ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ కు కోపం వచ్చి తృతీయ ప్రత్యాన్మయం అన్నారు . ఆ తరువాత బీజేపీ తో సంఖ్యత కుదరడంతో అదినేనెక్కడ అన్నానని మాట మార్చారు . ఇప్పడు ఆలా అనకపోయినా అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక పక్క మమతా ,మరోపక్క కేసీఆర్ బీజేపీ,కాంగ్రెస్ వ్యతిరేక కూటమికోసం ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. రేపు తిరుత్త‌ణిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ భేటీ స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇవాళ రాత్రికి త‌మిళ‌నాడులోని ఐటీసీ హోట‌ల్‌లో కేసీఆర్ బ‌స చేయ‌నున్నారు.

త‌మిళ‌నాడు తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంత‌కుముందు తిరుచ్చి క‌లెక్ట‌ర్ శ్రీనివాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆల‌యంలోకి తీసుకెళ్లారు

Leave a Reply

%d bloggers like this: