Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ బెయిల్ రద్దు కోసం మళ్ళీ రఘురామ పిటిషన్ ….

జగన్ బెయిల్ రద్దు కోసం మళ్ళీ రఘురామ పిటిషన్ ….
-జగన్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
-జగన్ పై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్న రఘురాజు
-బయట వుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పిటిషనర్
-తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
-గతంలో ఇలాంటి పిటిషన్ ను కొట్టేసిన సీబీఐ కోర్టు

అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ ను ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారించింది. దీనిపై జగన్ కు నోటీసులు జారీ చేసింది. జగన్ పై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని… జగన్ బయట ఉంటే తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో జగన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని గతంలో రఘురాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Related posts

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

Drukpadam

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలి…

Drukpadam

ట్యాంక్ బండ్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన షర్మిల!

Drukpadam

Leave a Comment