Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్ లో ఉన్నారా ?

టీఆర్ యస్ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్ లో ఉన్నారా ?
వారు బీజేపీ చేరేందుకు సిద్దపడుతున్నారా??
తెలంగాణ లో అధికారంలోకి వస్తానన్న 2023 బీజేపీ లో వ్యూహం ఏమిటి ?
బీజేపీ ఆకర్ష్ మంత్రం ఎంతవరకు పని చేస్తుంది.

బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. … అందుకోసం ఎత్తులు వేస్తుంది…వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. దీనికోసం ఆకర్ష్ మంత్రం అమలు చేస్తుంది. జిల్లాల వారీగా కీలక నేతలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం . టీఆర్ యస్ లో ఉన్న అసమ్మతి నేతలను గుర్తించి వారికీ గాలం వేయాలని చూస్తుంది. ఇప్పటికే కొంతమంది నాయకులతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం . అందులో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారి పేర్లు బయట పెట్టేందుకు బీజేపీ నిరాకరిస్తుంది. ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీ లు కూడా ఉన్నారని వారిలో ముఖ్యనేతలు కూడా టచ్ లో ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

2023 అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది…అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. ..అందుకే టీఆర్ యస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని చెబుతుంది. నిజంగా ఉన్నారా ? లేదా ? అనేది పక్కన పెడితే రాజకీయంగా టీఆర్ యస్ ను బలహీన పరిచే ఎత్తుగడలు వేస్తుంది. బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తమకు టీఆర్ యస్ కు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రకటించారు. ఇప్పటికే ఆకర్షణ మంత్రం ద్వారా వివిధ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటుంది బీజేపీ . ఇప్పుడు ఎమ్మెల్యేలపై ద్రుష్టి సారించింది. రాష్ట్రరాజకీయాలలో కీలక నేతలుగా ఉన్న కొందరిని తమవైపుకు లాక్కోవడంద్వారా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలనీ చూస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో సహజంగానే కొందరు నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా వారు ఉన్నారా ? బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా ? అనేది టీఆర్ యస్ లో జరిగే రాజకీయ మార్పులు చూడాల్సి ఉంది.

Related posts

రంగంలోకి నారా బ్రాహ్మణి …వైసీపీ పై పరువు నష్టం దావా …!

Drukpadam

తన ఇంటికి వచ్చిన బండి సంజయ్​ని ఆలింగనం చేసుకున్న బూర నర్సయ్య!

Drukpadam

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు: బాలినేని

Drukpadam

Leave a Comment