Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలు ….ఆరుకు ఆరు స్థానాలు గెలుచుకున్న టీఆర్ యస్!

ఎమ్మెల్సీ ఎన్నికలు ….ఆరుకు ఆరు స్థానాలు గెలుచుకున్న టీఆర్ యస్!
మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్
ఏకగ్రీవమైన ఆరు స్థానాలు
పోలింగ్ జరిగిన ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే
ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అంటున్న మంత్రులు
కేసీఆర్ వెంటే ప్ర‌జ‌లు…టీఆర్ఎస్‌కు తిరుగులేదు
పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ధన్య‌వాదాలు

 

టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది.

ఈ స్థానాలకు సంబంధించి ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్. రమణ, భానుప్రసాద్ గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, ఖమ్మం జిల్లాలో తాతా మధు, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గెలిచారు. దీంతో మొత్తం 12 స్థానాలను టీఆర్ఎస్ స్వీప్ చేసినట్టయింది. ఈ నెల 10న పోలింగ్ జరిగింది.

జిల్లాలవారీగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీ చేసిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా..అన్ని చోట్లా టీఆర్ఎసే ఘన విజయం సాధించింది.

నల్లగొండ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం సాధించారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1183ఓట్లు చెల్లాయి. చెల్లని ఓట్లు 50. గెలుపు కోటా 593 కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తమ్మీద 691 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు.

ఖమ్మం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురైంది. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్‌నే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

కరీంనగర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. జిల్లా ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు విజయం సాధించారు. భాను ప్రసాదరావుకు 500 ఓట్లు రాగా, ఎల్ రమణకు 450 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు వచ్చాయి.

మెదక్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 1010 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థికి 762 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 06 ఓట్లు రాగా…చెల్లనివి 12 ఓట్లు పోలయ్యాయి.

ఆదిలాబాద్‌

ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 72 ఓట్లు వచ్చాయి.

 

Related posts

వైసీపీ ప్రభుత్వ తప్పులు, అప్పులు, స్కాములపై మ‌హానాడులో తీర్మానం:చంద్రబాబు…

Drukpadam

షర్మిల ఖమ్మం టూర్ లో గిరిజనులతో ముఖాముఖీ

Drukpadam

తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలు ..ఏది నిజం …ఏది అబద్దం!

Drukpadam

Leave a Comment